Tollywood: హోస్ట్‌గా హీరో, హీరోయిన్ల కొత్త అవతారం

Tollywood: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ లో స్పెషల్‌ షోలకు హోస్టింగ్‌ * భారీగా రెమ్యునరేషన్‌

Sandeep Eggoju
Published on: 15 March 2021 11:21 AM IST
Tollywood Stars Becoming Host for TV Shows
X

హీరోస్ టీవీ షో హోస్టింగ్ (ఫైల్ ఫోటో)

Tollywood: టాలీవుడ్‌లో స్టార్‌ హీరో, హీరోయిన్లు హోస్ట్‌గా మారిపోతున్నారు. ఒకరి తర్వాత మరొకరు బిజీ అయిపోతున్నారు. గతంలో అడపా దడపా కార్యక్రమాలకు మాత్రమే హోస్ట్‌గా వ్యవహరించిన మన స్టార్స్‌ ఇప్పుడు దానిని ప్రొఫెషన్‌గా ఎంచుకుంటున్నారు. ఇంతకీ వారెవరు అనుకుంటున్నారా..?

తెలుగు స్టార్‌ హీరో, హీరోయిన్లు హోస్ట్‌గా కొత్త అవతారమెత్తుతున్నారు. వెండితెరపై తమ నటనతో పాటు హోస్ట్‌గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ లో స్పెషల్‌ షో లకు హోస్టింగ్‌ చేస్తున్నారు. దీనికి ఆయా సంస్థలు కూడా భారీ రెమ్యునరేషన్‌ ముట్ట చెప్పుతుండటంతో ఇప్పుడు దానిపై మన స్టార్స్‌ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటివరకు హోస్ట్‌గా వ్యవహరించిన స్టార్‌ హీరో, హీరోయిన్లలో కింగ్‌ నాగార్జున ముందువరసలో ఉన్నారు. ఎవరు మీలో కోటీశ్వరుడు, బిగ్‌బాస్‌లో పలు సీజన్లకు హోస్ట్‌గా ఉండి అందర్నీ అలరించారు నాగ్‌. ఇక.. ఎవరు మీలో కోటీశ్వరుడు ఒక సీజన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి హోస్ట్‌గా ఉన్నారు. బిగ్‌ బాస్‌-1 కి జూనియర్‌ ఎన్టీఆర్‌, బిగ్‌ బాస్‌-2 సీజన్‌కు నాని హోస్ట్‌ గా చేసి మెప్పించారు.

ఇక మరోసారి బుల్లితెరపై దర్శనం ఇవ్వబోతున్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. తాజాగా.. మరో టీవీ షోకు ఆయన సైన్‌ చేశారు. త్వరలో జెమిని టీవీలో ప్రసారమయ్యే ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి తారక్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షోపై అధికారిక ప్రకటన కూడా ఆయన చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో.. ప్రజాదరణ సంపాదించుకుంది. ఏప్రిల్ నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

గతంలో సీనియర్ నటి జయప్రద, జయసుధ, రమ్యక్రిష్ణ, ఆమని హోస్ట్ గా చేస్తే ఇప్పుడు మంచులక్ష్మీ, రోజా, జీవిత రాజశేఖర్ లు పలు షోలకు హోస్ట్ గా బిజీ అయిపోయారు. మొన్నటివరకు టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలకు మాత్రమే హోస్ట్ గా చేసిన మన స్టార్స్‌ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌లో కొన్ని ప్రోగ్రామ్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే.. బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ సమంత ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో సామ. జామ్ షో తో సందడి చేశారు. ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్‌లో హీరో దగ్గుబాటి రానా నెం.1 యారి మూడో సీజన్ చేయబోతున్నారు. మొత్తానికి మన స్టార్‌లు ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు షో లకు హోస్ట్‌లుగా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story