ఆలియా భట్ ని రికమెండ్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు

ఆలియా భట్ ని రికమెండ్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు

admin1
Updated on: 10 March 2022 10:30 AM IST
Tollywood Star Heroes Recommending Alia Bhatt | Tollywood News
X

ఆలియా భట్ ని రికమెండ్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు

Alia Bhatt: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ మల్టీస్టారర్ "ఆర్ఆర్ఆర్" భారీ అంచనాల మధ్య మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిత్ర షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ కి ఆలియా మంచి స్నేహితురాలు అయింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకి హీరోయిన్ గా అలియా నే తీసుకున్నారు ఎన్టీఆర్ అని తెలుస్తోంది. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే నిజంగానే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఆలియా ను రికమెండ్ చేశారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ సమయంలో మాత్రం అలియా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు మంచి స్నేహితురాలిగా మారిందట. ఆ స్నేహం కారణంగానే కొరటాల శివ సినిమా కోసం ఎన్టీఆర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరో వైపు రామ్ చరణ్ కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం అలియా ను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా పాటలెక్కనుంది.

admin1

admin1

Next Story