Fight Scenes in Jungle: అడవులలో ఫైట్లు చేయనున్న స్టార్ హీరోలు

Tollywood - Fight Scenes in Forest: అడవి బ్యాక్ డ్రాప్ తో సాగానున్న స్టార్ హీరో సినిమాలు

admin1
Updated on: 12 Dec 2021 3:44 PM IST
Tollywood Star Hero Movies Fight Scenes Shoots in Jungle Backdrop
X

అడవి బ్యాక్ డ్రాప్ తో సాగానున్న స్టార్ హీరో సినిమాలు

Fight Scenes in Jungle: డిసెంబర్, జనవరిలో చాలా వరకు స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 17న అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా విడుదల కాబోతుంది. జనవరి 7 న రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల "ఆర్ ఆర్ ఆర్" మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన "భీమ్లా నాయక్" సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. అయితే ఈ మూడు సినిమాలకి కొన్ని ఆసక్తికరమైన పోలికలు ఉన్నాయి. అందులో మొదటిది ఈ మూడు సినిమాల్లోనూ చాలా వరకు యాక్షన్ సన్నివేశాలు జరగనున్నాయి.

"పుష్ప" సినిమా లో శేషాచలం అడవులలో కొన్ని ఫైట్లు జరగనుండగా, "ఆర్ ఆర్ ఆర్" లో ఇద్దరు హీరోలు అడవిలోకి వెళ్లి కొన్ని ఫైట్లు చేయబోతున్నారు. "భీమ్లా నాయక్" సినిమా చాలా వరకు ట్రైబల్ ఏరియా లో జరుగుతుంది. అక్కడ కూడా అడవుల్లో ఫైట్లు ఉండబోతున్నాయి. మరోవైపు ఈ మధ్యనే విడుదలైన "అఖండ" సినిమాలో కూడా చాలా వరకు యాక్షన్ సన్నివేశాలు కర్ణాటకలోని దండేలి అడవుల్లో జరిగాయి. ఇక త్వరలో విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" సినిమా లో కూడా నక్సలిజం బ్యాక్ డ్రాప్ ఉండడంతో కొన్ని యాక్షన్ సన్నివేశాలు అడవిలో జరిగినట్లు తెలుస్తోంది. చూస్తూ ఉంటే ఈ స్టార్ హీరోల సినిమాలు అడవుల అందాలని ప్రేక్షకులకి చూపించబోతున్నట్లు చెప్పొచ్చు.

admin1

admin1

Next Story