Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సెట్స్ లో సందడి చేసిన స్టార్ దర్శకులు

Tollywood Star Directors SS Rajamouli, Trivikram, and Koratala Siva Visited Sarkaru Vaari Paata Sets
x

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సెట్స్ లో సందడి చేసిన స్టార్ దర్శకులు

Highlights

Sarkaru Vaari Paata: ఈ మధ్యనే సినిమా నుంచి విడుదలైన 'కళావతి' పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది...

Sarkaru Vaari Paata: ఈ మధ్యనే "సరిలేరు నీకెవ్వరు" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ డైరెక్షన్లో "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ మధ్యనే సినిమా నుంచి విడుదలైన 'కళావతి' పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ లోని కొందరు స్టార్ డైరెక్టర్లు మహేష్ బాబు సినిమా షూటింగ్ సెట్స్ కి విచ్చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు కొరటాల శివ ఈ చిత్రం షూటింగ్ సెట్స్ కి నిన్న విచ్చేశారట. మహేష్ బాబు మరియు మిగతా చిత్ర బృందంతో కాసేపు గడిపి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు.

సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న "సర్కారు వారి పాట" సినిమా ఈ ఏడాది మే 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. సముద్రఖని, వెన్నెల కిషోర్, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories