Samantha - Naga Chaitanya: మౌనం తో అభిమానులను కంగారు పెడుతున్న స్టార్ కపుల్

Samantha - Naga Chaitanya: పెళ్లయిన తర్వాత "మజిలీ" సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

admin1
Updated on: 30 Aug 2021 7:18 AM IST
Tollywood Star Couple Naga Chaitanya Samantha Akkineni about Name Change on Social Media | Tollywood News Today
X

మౌనం తో అభిమానులను కంగారు పెడుతున్న స్టార్ కపుల్

Samantha - Naga Chaitanya: టాలీవుడ్ లో ఉన్న స్టార్ కపుల్స్ లో సమంత నాగచైతన్య పేరు ముందే ఉంటుంది. "ఏ మాయ చేసావే" షూటింగ్ సెట్స్ పై కలుసుకున్న వీరు మంచి స్నేహితులుగా మారారు. ఆ తర్వాత కలిసి చాలా సినిమాలు చేసిన సమంత మరియు నాగచైతన్య "మనం" సినిమా తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు. 2017 అక్టోబర్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా క్రిస్టియన్ మరియు హిందూ పద్ధతులలో జరిగింది. పెళ్లయిన తర్వాత "మజిలీ" సినిమాలో కలిసి నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ జంట ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం సమంత ఇంస్టాగ్రామ్ లో తన పేరును సమంత అక్కినేని నుంచి ఎస్ గా మార్చుకోవడం.

ఇంస్టాగ్రామ్ లో తన పేరు మార్చిన మరుక్షణం నుంచి ఆ వార్త ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుకార్లకు నేను జవాబు ఇవ్వను అంటూ ఘాటుగా స్పందించింది సమంత. ఈ నేపథ్యంలో సమంత మరియు నాగచైతన్య మధ్య గొడవలు జరుగుతున్నాయని, వారి మధ్య విభేదాలు రావడంతో వారు విడిపోవాలని అనుకుంటున్నారని వార్తలు బయటకు వచ్చాయి. దీంతో అభిమానులు ఖంగుతిన్నారు. అభిమానులు ఎంత అడుగుతున్నప్పటికీ సమంత మరియు నాగచైతన్య మాత్రం మౌనంగా ఉండటం అందరినీ మరింత ఆవేదనకు గురి చేస్తోంది. ఈ పుకార్లలో నిజం లేదని సమంత లేదా నాగ చైతన్య ఎప్పుడు ప్రకటిస్తారు అని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

admin1

admin1

Next Story