శ్రావణ భార్గవి, హేమచంద్ర విడిపోతున్నారా ?

Hemachandra And Sravana Bhargavi: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలు విడాకులు తీసుకుంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు.

Arun Chilukuri
Updated on: 24 Jun 2022 8:01 PM IST
Tollywood Singers Hemachandra and Sravana Bhargavi News
X

శ్రావణ భార్గవి, హేమచంద్ర విడిపోతున్నారా ?

Hemachandra And Sravana Bhargavi: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలు విడాకులు తీసుకుంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే సమంత మరియు నాగచైతన్య వంటి స్టార్ జంట విడిపోయిన విషయాన్ని ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా సుమ మరియు రాజీవ్ కనకాల కూడా విడిపోయినట్లు వార్తలు వినిపించాయి కానీ వాటిలో నిజం లేదని సుమ క్లారిటీ ఇచ్చింది.

తాజాగా ఇప్పుడు మరొక జంట విడిపోతున్నట్లుగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. సింగర్ లుగా తమ పాటలతో ఎన్నో చార్ట్ బస్టర్ పాటలను అందించి అందరి మనసులను దోచుకున్న హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బుల్లితెర షోస్ లో కూడా అప్పుడప్పుడు కలిసి కనిపించే ఈ జంట తమ సందడి తో అందరినీ అలరిస్తారు. ఎంతో అన్యోన్యంగా ఉండే భార్య భర్తలు గా పేరు తెచ్చుకున్న వీరు ఇప్పుడు విడిపోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

తొమ్మిదేళ్ల పాటు కొనసాగిన వీరి వివాహ బంధానికి ఇప్పుడు వీరు ముగింపు పలకబోతున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొందరు వాదిస్తుండగా ఇంత అందమైన జంట విడిపోకూడదు అని మరికొందరు కోరుకుంటున్నారు. మరి ఈ విషయమై హేమచంద్ర లేదా శ్రావణ భార్గవిలు క్లారిటీ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story