ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కన్నుమూత
x
Highlights

tollywood senior director nb chakravarthi passes away: టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఎన్‌ బీ చక్రవర్తి శుక్రవారం...

tollywood senior director nb chakravarthi passes away: టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఎన్‌ బీ చక్రవర్తి శుక్రవారం ఉదయం మరణించారు. ఈ మేరకు బీఏ రాజు ట్వీట్‌ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చక్రవర్తి ఈ రోజు ఉదయం కన్ను మూశారని రాజు ట్వీట్‌ చేశారు. చక్రవర్తి శోభన్ బాబుతో 1984లో 'సంపూర్ణ ప్రేమాయణం', 1985-86లో నందమూరి బాలకృష్ణ నటించిన 'కత్తుల కొండయ్య','నిప్పులాంటి మనిషి' చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు 1986లో వచ్చిన 'కాష్మోరా'చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి ప్రజాధారణ పొందింది. సీనియర్ దర్శకుడి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories