Breaking News: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం.. సినిమా షూటింగ్‌లు బంద్?

Tollywood: టాలీవుడ్ లో మ‌రోసారి `స‌మ్మె` సైర‌న్ మోగింది. ఈసారి ఏకంగా నిర్మాత‌లే షూటింగుల బంద్‌కు పిలుపు నిచ్చారు.

Arun Chilukuri
Updated on: 17 July 2022 8:22 PM IST
Tollywood Producers to Stop Shootings
X

Breaking News: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం.. సినిమా షూటింగ్‌లు బంద్?

Tollywood: టాలీవుడ్ లో మ‌రోసారి `స‌మ్మె` సైర‌న్ మోగింది. ఈసారి ఏకంగా నిర్మాత‌లే షూటింగుల బంద్‌కు పిలుపు నిచ్చారు. మొన్న‌టి వ‌ర‌కూ మా జీతాలు పెంచాలి అని సినీ కార్మికులు బంద్ పేరుతో బెదిరించారు. ఇప్పుడు నిర్మాత‌లే షూటింగులు వ‌ద్ద‌న‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. గతకొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చిత్ర నిర్మాణ వ్యయం తగ్గించాలని ప్రొడ్యూసర్లు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. రోజురోజుకూ సినిమాకు ఖర్చు చేసేది ఎక్కువ అవుతుంది కానీ, తగ్గకపోవడంతో సినిమా షూటింగ్స్ బంద్‌పై అగ్ర నిర్మాతలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఆగస్టు 1వ తేదీ నుంచి అన్ని సినిమా షూటింగ్‌లు బంద్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవసరమైతే రెండు, మూడు నెలల పాటు సినిమా షూటింగ్‌లు బంద్ చేయాలని అగ్ర నిర్మాతలు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. నిర్మాణ వ్యయం తగ్గకపోతే ఇండస్ట్రీకి మనగడ లేదని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ తర్వాత థియేటర్ల పరిస్ధితి రోజురోజుకు దిగజారుతోంది. పదివారాల తర్వాతే ఓటీటీల్లో సినిమాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆగస్ట్ 1 నుంచి ఓటీటీల్లో విడుదలకు పది వారాల లాక్ ఇన్ పీరియడ్ అమలు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story