Film Producers: పవన్ ను కలసిన దిల్ రాజు బృందం
* పవన్‌తో భేటీ అయిన దిల్‌రాజు, దానయ్య, నవీన్, వంశీరెడ్డి, సునీల్ నారంగ్, బన్నీవాసు
పవన్ కల్యాణ్‌ను కలిసిన ప్రముఖ నిర్మాతలు (ట్విట్టర్ ఫోటో)
Film Producers: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను ప్రముఖ నిర్మాతలు కలిశారు. దిల్‌రాజు, దానయ్య, నవీన్, వంశీరెడ్డి, సునీల్ నారంగ్, బన్నీవాసు పవన్‌తో భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆన్ లైన్ టికెట్, టికెట్ ధర పెంపు వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత పెరిగింది. ఇటీవల ఈ నిర్మాతల బృందం మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యారు. చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని, సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని తామే కోరినట్టు ఆ సమావేశంలో తెలిపారు. ఈ క్రమంలో వారు పవన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Next Story




