Tollywood Producer Pokuri Ramrao Died: కరోనాతో టాలీవుడ్ నిర్మాత మృతి!

Tollywood Producer Pokuri Ramrao Died: కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిని భయపెడుతుంది.

Krishna
Published on: 4 July 2020 1:30 PM IST
Tollywood Producer Pokuri Ramrao Died: కరోనాతో టాలీవుడ్ నిర్మాత మృతి!
X

Tollywood Producer Pokuri Ramrao Died: కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిని భయపెడుతుంది. ఇక ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందినా వారు చాలా మంది కరోనా బారినా పడ్డారు. మరికొందరిని కరోనా బలితీసుకుంది. తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ పోకూరి రామరావు (64) కరోనాతో పోరాడి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అయన కరోనా లక్షణాలు కనిపించడంతో అయన ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

అక్కడ అయన చికిత్స పొందుతూ నిన్న సాయింత్రం మృతి చెందారు. అయన మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సంతాపం తెలుపుతుంది. పోకూరి రామరావు తన అన్నయ్య పోకూరి బాబురావుతో మరియు నటుడు గోపీచంద్ తండ్రి కృష్ణతో కలిసి ఈతరం బ్యానర్ పై కొన్ని సినిమాలని నిర్మించారు. ఇక గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం, రణం అనే సినిమాలకి కూడా పోకూరి రామరావు నిర్మాతగా వ్యవహరించారు.

ఇక దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులు రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతుండటం మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 22,771 కేసులు నమోదు కాగా, 442 మంది ప్రాణాలు విడిచారు.

తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 6,48,315 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,35,433 ఉండగా, 3,94,226 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 18,655 మంది కరోనా వ్యాధితో మరణించారు.


Krishna

Krishna

Next Story