Producer Mahesh Koneru: టాలీవుడ్ నిర్మాత మహేష్ కోనేరు కన్నుమూత

Producer Mahesh Koneru: 118, తిమ్మరుసు, మిస్‌ ఇండియా చిత్రాలకు నిర్మాతగా మహేష్ కోనేరు...

Shireesha
Published on: 12 Oct 2021 12:04 PM IST
Tollywood Producer Mahesh Koneru No More | Telugu Cinema News
X

Producer Mahesh Koneru: టాలీవుడ్ నిర్మాత మహేష్ కోనేరు కన్నుమూత

Producer Mahesh Koneru: టాలీవుడ్ నిర్మాత మహేష్ కోనేరు కన్నుమూశారు. ఉదయం విశాఖలో గుండెపోటుతో మరణించారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో తెలుగులో పలు చిత్రాలను నిర్మించారు మహేష్ కోనేరు. ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌కు మహేశ్‌ కోనేరు వ్యక్తిగత పీఆర్‌గా పనిచేశారు. 118, తిమ్మరుసు, మిస్‌ ఇండియా చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.

మహేశ్‌ కోనేరు మృతి వార్త తెలిసి షాక్‌కు గురయ్యానని ఎన్టీఆర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. బరువెక్కిన హృదయంతో చెబుతున్నా.. నా ఆప్త మిత్రుడు మహేశ్‌ కోనేరు ఇక లేరు. నాకు మాటలు రావడం లేదు. మహేశ్‌ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు.

Shireesha

Shireesha

Next Story