Dil Raju: స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి 'వారసుడొచ్చాడు'

Dil Raju: స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి 'వారసుడొచ్చాడు'

Rama Rao
Updated on: 29 Jun 2022 10:54 AM IST
Tollywood Producer Dil Raju Blessed With Baby Boy | Tollywood
X

Dil Raju: స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి ‘వారసుడొచ్చాడు’

Dil Raju: తాజాగా దిల్ రాజు ఫ్యామిలీలో కొత్త సంతోషాలు వెళ్లి విరిసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యారు. దిల్ రాజు భార్య తేజస్విని(వైగా రెడ్డి) బుధవారం తెల్లవారు జామున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీనితో దిల్ రాజు ఫ్యామిలీ సంతోషంలో మునిగితేలుతున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం దిల్ రాజు మొదటి భార్య అనిత అకాల మరణం చెందారు. వీరికి హన్షిత రెడ్డి సంతానం.

మొదటి భార్య మరణం తర్వాత తన కుమార్తె హన్షిత, ఇతర కుటుంబ సభ్యుల సలహా మేరకు దిల్ రాజు 2020లో తేజస్వినిని రెండవ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె గర్భందాల్చింది. ఇప్పుడు ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ వార్త తెలియగానే సెలెబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో దిల్ రాజు, తేజస్విని దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story