Bogari Laxmi Narayana : కరోనా వైరస్ తో టాలీవుడ్ నిర్మాత మృతి!

Bogari Laxmi Narayana : కరోనా వైరస్ తో టాలీవుడ్ నిర్మాత మృతి!
x

coronavirus

Highlights

Bogari Laxmi Narayana : కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకుతూ భయబ్రాంతులకి గురిచేస్తోంది.

Bogari Laxmi Narayana : కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకుతూ భయబ్రాంతులకి గురిచేస్తోంది. ఇక ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది సినిమా సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. అయితే ఇందులో ఎక్కువమంది కోలుకోవడం సంతోషించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు.. అయితే కొందరు మాత్రం మృతి చెందడం ఆందోళనకరంగా మారింది. తాజాగా టాలీవుడ్ లోని ఓ నిర్మాత కరోనాతో పోరాడి మృతి చెందారు..

గత రాత్రి టాలీవుడ్ నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ కన్ను మూశారు. గత కొద్ది రోజుల క్రితం ఆయనకి కరోనా సోకింది. అయితే చికిత్స కోసం ఆయ‌న య‌శోద ఆసుప‌త్రిలో చేరారు. అక్కడ ఆయన ఆరోగ్యం మరింతగా క్షిణించడంతో అయన మృతి చెందారు. అయన మరణవార్త తెలియగానే చాలా మంది సినీ ప్రముఖులు అయనకి సంతాపం తెలిపారు. బోగారి లక్ష్మీనారాయణ తెలుగులో 'ఎదురీత' అనే సినిమాను నిర్మించారు. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories