ఎమ్మెల్యే రోజాతో బండ్ల గణేష్...

Bandla Ganesh Meet Roja : సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గానే ఉంటారు సినీ నిర్మాత బండ్ల గణేష్.. ఎదో ఒక విషయం పైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారయన..

Krishna
Published on: 31 Oct 2020 3:26 PM IST
ఎమ్మెల్యే రోజాతో బండ్ల గణేష్...
X

Bandla Ganesh Meet Roja : సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గానే ఉంటారు సినీ నిర్మాత బండ్ల గణేష్.. ఎప్పుడూ.. ఎదో ఒక విషయం పై వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారయన.. ఆ మధ్య ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న గణేష్, జనసేన నేత పవన్ కళ్యాణ్ పై నగరి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో స్పందించారు.. అప్పటినుంచి ఇద్దరి మద్య పెద్దగా మాటలు లేవు.. అయితే తాజాగా ఎమ్మెల్యే రోజాతో కలిసిన ఫోటోను షేర్ చేశారు గణేష్.. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ ఫోటో దిగారు. ఈ సందర్బంగా " చాలాకాలం తర్వాత రోజా గారిని కలిశాను... ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని, ఆమెకు ఆరోగ్య, ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు గణేష్..

తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమాల్లో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు బండ్ల గణేష్.. . సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో మొదలగు చిత్రాలు నిర్మించారు. ఆ తరవాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అతనికి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2019లో తానూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలను నిర్మించే పనిలో ఉన్నారు గణేష్!

Krishna

Krishna

Next Story