logo
సినిమా

MAA Elections: బండ్ల గణేష్ బంపర్ ఆఫర్

Tollywood Producer Bandla Ganesh files Nomination for MAA Elections
X

MAA Elections: బండ్ల గణేష్ బంపర్ ఆఫర్

Highlights

MAA Elections: 'మా' ఎన్నికలకు సంబంధించి నామనేషన్ల సందడి మొదలైంది.

MAA Elections: 'మా' ఎన్నికలకు సంబంధించి నామనేషన్ల సందడి మొదలైంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్, సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. ఇక జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇదే సమయంలో మా బిల్డింగ్‌పై బండ్ల గణేష్ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీకి మా బిల్డింగ్ అవసరం లేనేలేదన్నారు. ఇప్పుడున్న ఆఫీస్ చాలన్న గణేష్ కొందరు కావాలనే ప్రలోభ పెడుతున్నారన్నారు. 'మా' ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీగా తన గెలుపు తథ్యమని, తనకు ఎంతమంది ఆశీర్వాదాలు ఉన్నాయో ఎవరికీ తెలియదని బండ్ల గణేశ్ అన్నారు. 'మా' ఎన్నికల్లో తాను రాకెట్‌లా దూసుకెళ్తున్నానని, తన విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తాను గెలిస్తే, 100మంది పేద కళాకారులను డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Web TitleTollywood Producer Bandla Ganesh files Nomination for MAA Elections
Next Story