Tollywood: హైదరాబాద్‌ టు ముంబైకి తెలుగు హీరోలు, హీరోయిన్లు

Tollywood: పాన్‌ ఇండియా సినిమాలపై ప్రత్యేక దృష్టి * మకాం మార్చే ప్లాన్‌లో కొందరు ఫిల్మ్ స్టార్స్‌

Sandeep Eggoju
Updated on: 9 July 2021 1:26 PM IST
Tollywood Heros Special Focus on Pan India Movies
X

హీరో రాంచరణ్ అండ్ విజయ్ దేవరకొండ (ఫైల్  ఇమేజ్)

Tollywood: హైదరాబాద్‌ టు ముంబైకి మకాం మార్చేస్తున్నారు టాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్లు. తెలుగు ఇండస్ట్రీలోని హీరోలంతా పాన్‌ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు. తమ మార్కెట్‌ పెంచుకోవాలంటే అవి అయితేనే బెటర్‌ అని భావిస్తున్నారు. ఇప్పటికే యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా మూవీసే చేస్తున్నాడు. ఆదిపురుష్‌, సలార్‌, రాధే శ్యామ్‌ సినిమాల షూటింగ్‌కు ముంబై నుంచే అటెండ్‌ అవుతున్నారు డార్లింగ్. ఇక.. ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత శంకర్‌, రాంచరణ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది. ఇందుకోసం.. ముంబైలో చెర్రీ ప్లాట్‌ కొంటున్నట్టు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కడినుంచే షూటింగ్‌లో పాల్గొనాలని చరణ్‌ అనుకుంటున్నారంట.

ఇక ద ఫ్యామిలీ మ్యాన్‌-2తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత అక్కడ నుంచి వస్తున్న చాలా ఆఫర్స్‌కు ఓకే చెబుతోందంట. ఇప్పుడు ముంబైలో సొంత ప్లాట్‌ కోసం సెర్చింగ్‌ కూడా మొదలుపెట్టినట్టు టాక్‌. నాగచైతన్య కూడా అమీర్‌ఖాన్‌ సినిమాలో ఓ పాత్ర చేయనున్నాడు. దీంతో తమ మకాం ముంబై అయితే మంచిదని ఈ జంట భావిస్తోంది. ఇప్పటికే.. ముంబైలో ఓన్‌ ప్లాట్‌ కొనుక్కొని అక్కడ నుంచే సినిమాలు చేస్తోంది కాజల్‌ అగర్వాల్. అలాగే రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ముంబైలో ఉంటూనే లైగర్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. వీరే కాదు.. ఇంకా చాలా మంది స్టార్స్‌ ముంబైకి షిప్ట్‌ అవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారని చిత్రవర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story