Home Quarantine: హోమ్ క్వారంటైన్‌లో టాలీవుడ్ హీరోలు

Home Quarantine: టాలీవుడ్ హీరోలు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే కరోనా పాజిటివ్ తో మాత్రం కాదు.

Venkata Chari
Updated on: 23 April 2021 9:00 AM IST
Tollywood Heros Mahesh Babu, Prabhas, Ramcharan Tej Under Home Quarantine
X

టాలీవుడ్ హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్

Home Quarantine: టాలీవుడ్ హీరోలు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే కరోనా పాజిటివ్ తో మాత్రం కాదు. ముందు జాగ్రత్తగా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారంట. కారణం షూటింగ్‌ లో కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ప్రస్తుతానికి చాలా షూటింగ్‌లకు ప్యాకప్ చెప్పేశారు.

హీరో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్‌ లు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. 'సర్కారువారి పాట' సినిమా షూటింగ్‌ సమయంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ అని తేలిందంట. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. అయితే కోవిడ్‌ బారినపడ్డ 5గురిలో మహేశ్‌బాబు పర్సనల్ అసిస్టెంట్ ఉన్నారట. దీంతో డాక్టర్‌ సూచన మేరకు మహేశ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు.

కాగా, మొన్నటివరకు 'రాధేశ్యామ్‌' సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు ప్రభాస్‌. ఈ రెబల్‌స్టార్ మేకప్‌మ్యాన్‌కు కూడా కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ప్రభాస్ హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారంట. అలాగే ఇటీవల సోనూ సూద్‌కు కరోనా పాజిటివ్‌ గా తేలిన విషయంత తెలిసిందే. ఈ మధ్య ఆయన 'ఆచార్య' షూటింగ్‌లో పాల్గొన్నారు.

రామ్‌చరణ్, సోనూలపై కోన్ని సన్నివేశాలను షూట్ చేశారంట. అలాగే చిరంజీవి, చరణ్‌ సహాయకుల్లోనూ ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో డాక్టర్ల సూచన మేరకు రామ్‌చరణ్‌ కూడా క్వారంటైన్‌లో ఉంటుంన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలు క్వారంటైన్‌లోకి వెళ్లడంతో.. ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశమైంది.

Venkata Chari

Venkata Chari

Next Story