Tollywood: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న ఛార్మి..వ‌రుడు ఎవ‌రంటే..?

Tollywood: టాలీవుడ్ చార్మింగ్ గాళ్ చార్మి ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకోబోతోందట. అప్పుడేప్పుడో 'నీతోడు కావాలి' అంటూ టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ భామ‌.

Samba Siva Rao
Updated on: 7 May 2021 7:32 PM IST
Tollywood Heroine Charmi Kaur Going Marriage her Relative
X
ఛార్మి (ఫైల్ ఇమేజ్)

Tollywood: టాలీవుడ్ చార్మింగ్ గాళ్ చార్మి ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకోబోతోందట. అప్పుడేప్పుడో 'నీతోడు కావాలి' అంటూ టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ భామ‌. మూడు పదుల వయసు దాటినా ఇప్పటిదాకా పెళ్లి ఊసెత్తలేదు చార్మి. దీంతో చార్మి ఓ యువ సంగీత ద‌ర్శ‌కుడితో డేటింగ్ లో ఉంద‌ని, ఓ అగ్ర‌ ద‌ర్శ‌కుడితో క‌లిసి తిరుగుతంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఎవరు, ఏంటి వివరాలను ప్రస్తావించకుండానే తాను ప్రేమలో విఫలమయ్యానంటూ చార్మి ఆ మధ్య వెల్లడించింది. అంతేకాదు తనకు, పెళ్లికీ పడదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

అయితే ఈ వార్త‌ల‌న్నిటికీ చార్మి ఫుల్ స్టాప్ పెట్టిన‌ట్లు అయింది. చార్మి పెళ్లి నిశ్చ‌యం అయింద‌ని తెలుస్తోంది. తమ సమీప బంధువుతో కలిసి ఏడు అడగులు నడిచేందుకు సిద్ధమవుతోందట. ఇపుడు ఈ వార్తే టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది.ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినట్లు తెలుస్తోంది.

ఇక చార్మి జ్యోతిల‌క్ష్మి సినిమాతో నిర్మాత‌గా మారింది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆ సినిమా నిర్మించింది. వీరిద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ అనే నిర్మాణం సంస్థను మెుదలుపెట్టారు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరీ కనక్ట్స్‌ బ్యానర్స్‌ పై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది వ‌చ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో వీరిలో జోష్ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే చార్మి పెళ్లి వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇందులో ఎంత వ‌ర‌కు నిజం వుందో తెలియాలంటే చార్మి నోరు విప్ప‌క త‌ప్ప‌దు.

గ‌త ఏడాది క‌రోనాను ఆహ్వానిస్తూ సోష‌ల్ మీడియాలో చార్మి చేసిన హ‌ల్ చ‌ల్ అంతా ఇంతాకాదు. చార్మిపై నెటిజ‌న్లు మండిప‌డ్డారు. క‌రోనా చుట్ట‌మ‌నుకున్నావా అని నెటిజ‌న్లు ఫైర్ అయ్యారు. దీంతో అభాసుపాలైన చార్మి వెంట‌నే ఆ వీడియో డిలిట్ చేసింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story