'కరోనా'కు వెల్‌కమ్ చెప్పిన ఛార్మి.. నెటిజన్ల ఫైర్ అవ్వడంతో వీడియో డిలిట్


కరోనా వైరస్ మహ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలసిందే. చైనాలో పుట్టిన ఈ మహ్మారి ఇప్పటికే భారత్ తో పాటు ప్రపంచ దేశాలకు వ్యాపించింది.
కరోనా వైరస్ మహ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలసిందే. చైనాలో పుట్టిన ఈ మహ్మారి ఇప్పటికే భారత్ తో పాటు ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి విషయం తెలిసిందే. అయితే దీని దెబ్బకు అన్ని దేశాలు గజ గజ వణికిపోతున్నాయి. కరోనా వైరస్ దెబ్బకు అగ్రదేశాలు సైతం ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక స్థంభించి పోయింది.
భారత్ లో మరో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయి. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు భారత ఆరోగ్య శాఖ లేఖ విడుదల చేసింది. వారిని చికిత్స కోసం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 28 రోజులపాటు వారు నిర్బంధంలోనే ఉండనున్నారు.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించింది. తాజాగా కరోనా వైరస్ తెలంగాణలో నమోదు కావడంపై ఛార్మి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పెద్ద దుమారమే రేగుతోంది. కరోనా వైరస్ తెలంగాణలో నమోదు కావడంతో ఏదో పెద్ద విజయం వరిచింనట్లు కరోనా వైరస్‌కు స్వాగతం అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసింది. దీనిపై చాలా మంది నెటిజన్స్ మండిపడ్డారు. కరోనా వైరస్‌ను స్వాగతం పలకడానికి అదేమైనా మంచి కార్యక్రమమా.. ఏదైనా శుభకార్యమా.. అంటూ మండిపడుతున్నారు. అసలు ఛార్మికి మైండ్ దొబ్బిందా అంటూ నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కరోనా వైరస్ పై కామెంట్స్ చేసి ఛార్మి అడ్డంగా బుక్కైంది. ఆ తర్వాత వెంటనే తాను చేసిన ట్వీట్ చార్మి డేలిట్ చేసింది. ఆ తర్వాత క్షమాణలు చెబుతూ.. ట్వీట్ చేసింది.
I have read all ur comments n I apologise for the video posted .. it was an act of immaturity for a very sensitive topic , n hence shall be carefull in my further reactions as it was of least knowledge to me the rounds it created .. pic.twitter.com/mXT95O1tFL
— Charmme Kaur (@Charmmeofficial) March 2, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



