ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు వెల్లువెత్తుతున్న విరాళాలు

CM Relief Fund: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

Arun Chilukuri
Published on: 1 Dec 2021 7:30 PM IST
Tollywood Heroes Donate To AP CM Relief Fund
X

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు వెల్లువెత్తుతున్న విరాళాలు

CM Relief Fund: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు వరద బాధితుల కోసం 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించగా మెగా ఫ్యామిలీ మరోసారి పెద్ద మనసు చాటుకుంది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చిరంజీవి, రాం చరణ్ ఇద్దరూ చెరో పాతిక లక్షలు విరాళం ప్రకటించారు. ఏ విపత్తు వచ్చినా బాధితులకు అండగా ఉంటామని మెగా ఫ్యామిలీ మరోసారి నిరూపించుకుంది. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా తన వంతు సాయంగా బాధితుల కోసం రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేస్తూ.. ఏపీ వరద విపత్తుకు నేను చేసే సాయం చిన్నదైనా బాధితులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story