Tollywood: తెలుగు హీరోల మనసు దోచిన హాలీవుడ్ బ్యూటీ

Sandeep Reddy
Updated on: 12 July 2021 10:00 PM IST
Tollywood Heroes Crush On Hollywood Actress Demi Moore
X

డేమి మూర్ (ఫైల్ ఫోటో)

Tollywood: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్స్ కి ఉండే ఫాలోయింగ్ గురించి మాములుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు... తమ అభిమాన నటులను డ్రీమ్ బాయ్, డ్రీమ్ గర్ల్, క్రష్ గా భావించే అభిమానులు మన తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నారు. నాటి తరం నటి సావిత్రి నుండి నేటి తరం సమంత వరకు.. సీనియర్ ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు పిచ్చిగా అభిమానించే, ప్రేమించే అభిమానులు తమ హీరోల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి చాలా ఆత్రుతతో ఉంటారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో పలువురు స్టార్ హీరోల ఫస్ట్ లవ్, క్రష్ ల గురించిన వార్త వైరల్ గా మారింది. గతంలో అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో తాను చిన్ననాటి నుండి ఐశ్వర్య రాయ్ అంటే చాలా ఇష్టమని ఐశ్వర్య పెళ్లి వార్త విని తన హృదయం రెండు ముక్కలైందని.., ఆ తర్వాత తనకి డేమి మూర్ అనే హాలీవుడ్ నటి క్రష్ గా మారిందని చెప్పకనే చెప్పాడు.

ఇక మరో స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూడా తన మొదటి క్రష్ హాలీవుడ్ నటి డేమి మూర్ అని 26 ఏళ్ళకి నమ్రతతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న తరవాత నమ్రతనే తన లవ్ అండ్ లైఫ్ అని గతంలో తన మనసు దోచిన హాలీవుడ్ నటిని గుర్తు చేసుకున్నాడు. ఇక మన "బాహుబలి" ప్రభాస్ కి మహేష్, బన్నీలా హాలీవుడ్ హీరోయిన్ కాకుండా బాలీవుడ్ లోని సీనియర్ నటి రవీనా టాండన్ అంటే తనకి క్రష్ అని ఇటీవల జరిగిన "సాహో" ప్రమోషన్ లో భాగంగా అభిమానులతో పంచుకున్నాడు. ఇక మన జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే తను చిన్నపాటి నుండి శ్రీదేవిని అభిమానించనని చెప్పుకొచ్చాడు. ఇలా సామాన్య ప్రేక్షకుడికి లాగే స్టార్ హీరోలకి కూడా ఫస్ట్ లవ్ ఉంటాయని మన హీరోలు పలు సందర్భాలలో తమ సీక్రెట్స్ ని షేర్ చేసుకున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story