విజయ్ సరికొత్త రికార్డు.. సౌత్ లోనే ఏకైక హీరో!

విజయ్ సరికొత్త రికార్డు.. సౌత్ లోనే ఏకైక హీరో!
x

Vijay Devarakonda 

Highlights

Vijay Devarakonda Instagram : పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మొదలై అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda Instagram : పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మొదలై అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. ఇక ఆ సినిమా తర్వాత గీతా గోవిందం భారీ హిట్ కావడంతో విజయ్ స్థాయి మరింతగా పెరిగింది. ఇక డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ప్లాప్స్ అయినప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా అభిమానుల మనుసులను దోచుకుంటున్నాడు విజయ్..

సోషల్ మీడియాలో విజయ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్ స్టా గ్రామ్ లో 9 మిలియన్ ( 90 లక్షలు) ఫాలోవర్స్ మార్క్ ను దాటేశాడు. సౌత్ ఇండియా మొత్తంలో 9 మిలియన్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. అయితే సోషల్ మీడియాలోకి ఎంటర్ ఐన అతి తక్కువ సమయంలో విజయ్ ఈ ఫీట్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి. 2018 మార్చ్ 7 న విజయ్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేశాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమాని చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరొనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని చార్మీ రూపొందిస్తున్నారు. సినిమాని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.. ఇక ఈ సినిమా విజయ్ కి పదోది కాగా, పూరికి 37 వ సినిమా .

Show Full Article
Print Article
Next Story
More Stories