Hero Sunil: 'వేయి శుభములు కలుగు నీకు' సినిమా టీజర్ ను విడుదల చేసిన హీరో సునీల్

Hero Sunil: వేయి శుభములు కలుగు నీకు సినిమా టీజర్ ను విడుదల చేసిన హీరో సునీల్
x

Veyi Shubhamulu kalugu neeku Teaser release

Highlights

Hero Sunil: జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం.

Hero Sunil: జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం "వేయి శుభములు కలుగు నీకు". హీరో సునీల్ ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేసి యూనిట్ సభ్యులందరికి తన శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం పాత్రికేయుల సమావేశం లో శివాజీ రాజా మాట్లాడుతూ "జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో తూము నరసింహ పటేల్ నిర్మాతగా మా అబ్బాయి విజయ్ రాజా హీరో గా నటిస్తున్న చిత్రం "వెయ్యి శుభములు కలుగు నీకు".

ఈ చిత్రం క్లాప్ హీరో నాగ శౌర్య చేయగా హీరో నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇప్పుడు హీరో సునీల్ ఈ చిత్రం యొక్క మొదటి టీజర్ ను విడుదల చేసారు, వారికీ నా కృతజ్ఞతలు. మా విజయ్ పుట్టినరోజున కథ విన్నాను, చాలా బాగా నచ్చింది. సినిమా షూటింగ్ టాకీ అంతా పూర్తీ అయ్యింది. సాంగ్స్ చిత్రీకరణ ఉంది. మా అబ్బాయి విజయ్ రాజా కి మంచి నిర్మాత మరియు మంచి దర్శకుడు దొరికారు, ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. టీజర్ చాలా బాగుంది. నన్ను ఆశీర్వదించి నాటే నా కుమారుడు ని కూడా ఆశీర్వదించండి" అన్ని కోరుకున్నారు.

హీరోయిన్ తమన్నా వ్యాస మాట్లాడుతూ "ఈ కరోనా టైం లో షూటింగ్ పూర్తీ చేసాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మరియు నిర్మాత కి ధన్యవాదాలు. మా హీరో విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని తెలిపారు.

హీరో విజయ్ రాజా మాట్లాడుతూ "నా పుటిన రోజున శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు సునీల్ అన్న మా సినిమా టీజర్ రిలీజ్ చేసారు, వారికి నా ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వస్తుంది. డైరెక్టర్ గారు సినిమా ని బాగా డైరెక్ట్ చేస్తున్నారు, నిర్మాత గారు కంప్రమైస్ కాకుండా ఖర్చు పెడుతున్నారు. ఇదే టీం తో మల్లి ఇంకో సినిమా త్వరలోనే స్టార్ట్ చేస్తాము" అని తెలిపారు.

మరో హీరోయిన్ జ్ఞాన ప్రియ మాట్లాడుతూ "ఈ సినిమా లో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి నిర్మాత గారికి థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న" అని తెలిపారు.

దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ "నాగ శౌర్య గారి క్లాప్ ఇస్తే, హీరో నాని గారు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తే ఇప్పుడు మా అందాల రాముడు హీరో సునీల్ గారు మా సినిమా టీజర్ ను విడుదల చేసారు, హీరోళ్లందరి ధన్యవాదాలు. మా హీరో విజయ్ రాజా కి జన్మదిన శుభాకాంక్షలు. మా సినిమా కి మంచి టైటిల్ దొరికింది. గురు గారు శివాజీ రాజా గారికి నా ధన్యవాదాలు. నాకు మంచి ఆక్టివ్ ప్రొడ్యూసర్ దొరికాడు. ప్రతి రోజు మా నిర్మాత అన్నీచూసుకుంటుంటాడు. సినిమా బాగా వస్తుంది " అని తెలిపారు.

హీరో సునీల్ మాట్లాడుతూ "నా కెరీర్ స్టార్టింగ్ లో నేను ఫస్ట్ కలిసింది శివాజీ రాజా గారినే కలిసాను. చాలా బాగా సహాయం చేసారు. విజయ్ రాజా నాకు చిన్నపాటి నుంచి తెలుసు. మంచి మనిషి, తన కళ్ళు బాగుంటాయి. తనకి జన్మదిన శుభాకాంక్షలు. టైటిల్ చాలా పాజిటివ్ గా ఉంది, సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను.

నిర్మాత తూము నరసింహ పటేల్ మాట్లాడుతూ "టీజర్ విడుదల చేసిన హీరో సునీల్ కి ధన్యవాదాలు. మా హీరో విజయ్ రాజా కి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా బాగా వస్తుంది. మంచి హిట్ అవుతుంది అని నమ్మకం ఉంది" అని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories