స్ట్రాంగ్ కంటెంట్ తో రవితేజ కమ్ బ్యాక్..!

Krack Movie Working Video: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్నారు.

Krishna
Published on: 12 Oct 2020 8:18 PM IST
స్ట్రాంగ్ కంటెంట్ తో రవితేజ కమ్ బ్యాక్..!
X

Krack Movie working Video 

Krack Movie Working Video: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ సరసన శ్రుతిహసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే లాక్‌డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా ఆగిపోయిన సినిమా షూటింగ్ తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది.

సినిమాకి సంబంధించిన వర్కింగ్ వీడియోని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ వీడియోలో చిత్రబృందం మోత్తాన్ని ప్రాప‌ర్‌గా శానిటైజ్ చేయ‌డం, ఎంట్రన్స్‌లో డిజిన్‌ఫెక్టెంట్ ట‌న్నెల్‌ను ఏర్పాటు చేయ‌డం కనిపిస్తోంది. ఇక సెట్లో అందరూ పక్కాగా మాస్క్ లు ధరించడం చూడవచ్చు.. ఇక నటీనటులు కూడా కెమెరా ముందుకు వ‌చ్చి న‌టిస్తున్నప్పుడు మాత్రమే మాస్క్‌లు తీసేస్తున్నారు. ఇక వీడియో చివర్లో రవితేజ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

ఇక ఈ వీడియో అభిమానులకి బాగా నచ్చేసిందని చెప్పాలి. మహారాజా రవితేజ పక్కా కంటెంట్ తో ముందుకు వస్తున్నాడని ఈ సారి హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పోస్టర్లతో సినిమా పైన అంచనాలను పెంచిన చిత్ర యూనిట్ తాజాగా మేకింగ్ వీడియోతో ఆ అంచనాలను మరింతగా పెంచేసింది. అట్టు విక్రమార్కుడు సినిమా తర్వాత రవితేజ మళ్ళీ పోలీస్ గెటప్ లో కనిపిస్తుండడంతో సినిమాపైన మంచి బజ్ ఏర్పడింది.

ఇక ఈ సినిమా అనంతరం రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాని చేస్తున్నాడు రవితేజ... గతంలో వీరి కాంబినేషన్ లో వీర అనే సినిమా వచ్చింది. తాజాగా రమేష్ వర్మ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రాక్షసుడు అనే సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు.


Krishna

Krishna

Next Story