ఖిలాడీగా రవితేజ!

ఖిలాడీగా రవితేజ!
x
Highlights

Raviteja khiladi Movie : మాస్ మహారాజా రవితేజ మళ్ళీ డోస్ పెంచాడు. బెంగాల్ టైగర్ సినిమా తర్వాత కొంచం గ్యాప్ తీసుకున్న రవితేజ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పైన క్రాక్ సినిమా ఉండగానే మరో సినిమాని లైన్ లో పెట్టాడు.

Raviteja khiladi Movie : మాస్ మహారాజా రవితేజ మళ్ళీ డోస్ పెంచాడు. బెంగాల్ టైగర్ సినిమా తర్వాత కొంచం గ్యాప్ తీసుకున్న రవితేజ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పైన క్రాక్ సినిమా ఉండగానే మరో సినిమాని లైన్ లో పెట్టాడు. రవితేజ 67వ సినిమాగా ఖిలాడీ వస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌లో రవితేజ లుక్ ఆక‌ట్టుకునేలాగా ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 02 నుంచి మొదలు కానుంది. ఇందులో డింపుల్ హయాతి, మీనాక్షి చౌధురి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రాక్షసుడు లాంటి బ్లాక్‌‌బస్టర్ తర్వాత రమేశ్‌ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రాక్ సినిమాని సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బి. మధు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ సరసన శ్రుతిహసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే లాక్‌డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా ఆగిపోయిన సినిమా షూటింగ్ తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ఇప్పటికే పోస్టర్లతో సినిమా పైన అంచనాలను పెంచేసింది చిత్ర యూనిట్.. ఇక విక్రమార్కుడు సినిమా తర్వాత రవితేజ మళ్ళీ పోలీస్ గెటప్ లో కనిపిస్తుండడంతో సినిమాపైన మంచి బజ్ ఏర్పడింది. క్రాక్, ఖిలాడీ సినిమాల తర్వాత వంశీ వక్కంతం, మారుతి డైరెక్షన్ లలో సినిమాలను చేయనున్నాడు రవితేజ!

Show Full Article
Print Article
Next Story
More Stories