చరణ్ అరుదైన రికార్డు!

చరణ్ అరుదైన రికార్డు!
x
Highlights

చరణ్ ఈ ఏడాది మార్చ్ లో ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేయగా, ఇప్పటివరకు ఆయనని 10 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. కానీ చరణ్ మాత్రం ఇద్దరినే ఫాలో అవుతున్నారు..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో అరుదైన ఘనతను సాధించాడు. ట్విట్టర్ ఖాతాలో అతి తక్కువ టైంలో 1 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు.. అయితే చెర్రీ కేవలం 233 రోజులలోనే ఈ ఘనత సాధించడం విశేషం.. టాలీవుడ్ లో మరే హీరో కూడా ఇంత తక్కువ సమయంలో ఈ ఘనతను అందుకోలేదట.. చరణ్ ఈ ఏడాది మార్చ్ లో ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేయగా, ఇప్పటివరకు ఆయనని 10 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. కానీ చరణ్ మాత్రం ఇద్దరినే ఫాలో అవుతున్నారు.. వారే చిరంజీవి, పవన్ కళ్యాణ్

అటు ప్రస్తుతం రామ్ చరణ్ RRR అనే సినిమాని చేస్తున్నాడు.. ఇందులో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా.. కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా మళ్ళీ మొదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories