హీరో రాజశేఖర్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల

హీరో రాజశేఖర్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల
x
Highlights

హీరో రాజశేఖర్‌ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు వైద్యులు. కొన్నిరోజులుగా కరోనాతో పోరాడుతున్న రాజశేఖర్‌.. చికిత్స నిమిత్తం హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు.

హీరో రాజశేఖర్‌ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు వైద్యులు. కొన్నిరోజులుగా కరోనాతో పోరాడుతున్న రాజశేఖర్‌.. చికిత్స నిమిత్తం హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. నిన్న మొన్నటివరకు ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అయితే ప్రస్తుతం వెంటిలేటర్‌ సహాయం లేకుండానే ఆయనకు ట్రీట్మెంట్‌ అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. అదేవిధంగా చికిత్సకు సహకరిస్తున్నట్లు వైద్యులు హెల్త్‌బులిటెన్‌లో తెలియజేశారు. అటు రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యాపిల్లలు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తాము కరోనాకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని, ఇద్దరు పిల్లలు ఇప్పటికే కరోనా నుంచి బయటపడ్డారని రాజశేఖర్ ఇటీవల తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories