Nikhil Siddharth : నిఖిల్ సిక్స్ ప్యాక్ చూసారా.. వావ్ అనాల్సిందే!

Nikhil Siddharth : నిఖిల్ సిక్స్ ప్యాక్ చూసారా.. వావ్ అనాల్సిందే!
x

nikhil siddharth six pack look

Highlights

Nikhil Siddharth : లాక్ డౌన్ వలన షూటింగ్ లు బంద్ కావడంతో సినీ హీరోలు కొత్తగా మేకోవర్ అయ్యేందుకు జిమ్, వ్యాయామం అంటూ

Nikhil Siddharth : లాక్ డౌన్ వలన షూటింగ్ లు బంద్ కావడంతో సినీ హీరోలు కొత్తగా మేకోవర్ అయ్యేందుకు జిమ్, వ్యాయామం అంటూ భారీగానే కసరత్తులు చేస్తున్నారు. తమ తమ ఫిజిక్‌పై దృష్టి పెడుతూ కొత్త సినిమాలకోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే V మూవీలో సుధీర్ బాబు కండలు పెంచి వావ్ అనిపించాడు. తాజాగా మరో యంగ్ హీరో నిఖిల్ కండలు పెంచి సిక్స్ ప్యాక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'సూపర్ డ్రై' అంటూ కామెంట్ చేశాడు నిఖిల్.. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



ఈ లాక్ డౌన్ సమయంలో తన ప్రియసఖి పల్లవి వర్మతో వివాహం చేసుకున్నాడు. ఇక నిఖిల్ సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ- 2 సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమాతో పాటుగా పల్నాటి సూర్యప్రతాప్ ద‌ర్శక‌త్వంలో '18 పేజీస్' సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాకి సుకుమార్ కథని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories