కళ్యాణ్ రామ్, నితిన్ లపై ఆసక్తికరమైన వాఖ్యలు చేసిన మంచు విష్ణు

కళ్యాణ్ రామ్, నితిన్ లపై ఆసక్తికరమైన వాఖ్యలు చేసిన మంచు విష్ణు
x
Manchu Vishnu (File Photo)
Highlights

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కుమారుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు విష్ణు.. అస్త్రం, ఢీ, దేనికైనా రేడీ మొదలగు సినిమాలు విష్ణుకి మంచి పేరును తీసుకువచ్చాయి.

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కుమారుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు విష్ణు.. అస్త్రం, ఢీ, దేనికైనా రేడీ మొదలగు సినిమాలు విష్ణుకి మంచి పేరును తీసుకువచ్చాయి. అయితే ప్రస్తుతం విష్ణు చేస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అయన తండ్రి మోహన్ బాబు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న మంచు విష్ణుతాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన తోటి హీరోలు అయిన నితిన్, కళ్యాణ్ రామ్, సుమంత్, గోపీచంద్ లపై ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.

మీ సహానటులతో మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్న మీకు వాళ్ళతో మల్టీస్టారర్ సినిమా చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదా? అని యాంకర్ ప్రశ్నించగా దీనిపైన స్పందించిన విష్ణు నితిన్‌, క‌ళ్యాణ్ రామ్‌ల‌ని రాస్కెల్స్ అని అన్నాడు. వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం, స్నేహం కారణంగానే విష్ణు అలా అన్నట్టుగానే అభిమానులు అనుకుంటున్నారు. నితిన్, కళ్యాణ్ రామ్‌లకు ఇప్పటికే నాలుగు సినిమాలు ఆఫర్ చేశానని విష్ణు వెల్లడించాడు. ఇక సుమంత్ ఎక్కడైన క‌నిపిస్తే గొంతు పిసికేయాల‌ని చూస్తున్నాను. మోస‌గాళ్ళు సినిమాలో న‌టించ‌మ‌ని అడ‌గ‌గా, ఆ క్యారెక్టర్ న‌చ్చలేద‌నే కార‌ణం చెప్పి త‌ప్పించుకున్నాడు.

ఇక నేను చేసిన ఈడో రకం ఆడో రకం సినిమాకి గానను ముందుగా కళ్యాణ్ రామ్ నే అనుకున్నానని కానీ అతను వద్దు అంటేనే రాజ్ తరుణ్ ని తీసుకున్నామని వెల్లడించాడు. ఇక హీరో నితిన్‌ విషయానికి వచ్చేసరికి నితిన్ తో కలిసి ఓ సినిమా చేయాలని గత పది, పన్నెండేళ్లుగా ట్రై చేస్తున్నానని వెల్లడించాడు. మా ఇద్దరి మధ్య మంచి టైమింగ్ ఉంటుందని 'దోస్తానా' సినిమా చేయాలని చాలాసార్లు అడిగాను . కానీ ఎందుకో కుద‌ర‌ట్లేదని విష్ణు చెప్పుకొచ్చాడు. ఇక నితిన్ ఎంతో హార్డ్ వ‌ర్కర్ అని అతనికి హిట్ వస్తే నాకు హిట్ వచ్చినట్టే అని చెప్పుకొచ్చాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories