గ్రాండ్ గా స్నేహారెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్!

గ్రాండ్ గా స్నేహారెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్!
x

Allu Arjun wife Sneha reddy birthday celebrations 

Highlights

Sneha Reddy Birthday Celebrations : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి 35 వ పుట్టిన రోజు వేడుకలు సోమవారం అర్ధరాత్రి జరిగాయి.. ఈ పుట్టిన రోజు వేడుకలకి అల్లు స్నేహరెడ్డి, అల్లు అర్జున్, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మాత్రమే హాజరయ్యరు.

Sneha Reddy Birthday Celebrations : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి 35 వ పుట్టిన రోజు వేడుకలు సోమవారం అర్ధరాత్రి జరిగాయి.. ఈ పుట్టిన రోజు వేడుకలకి అల్లు స్నేహరెడ్డి, అల్లు అర్జున్, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మాత్రమే హాజరయ్యరు. ఈ వేడుకలో అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పోస్ట్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

'నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలి. మరెన్నో పుట్టినరోజు వేడుకలకు నేను ఇలానే నీ పక్కనుండాలని కోరుకుంటున్నా. జన్మదిన శుభాకాంక్షలు క్యూటీ..' అంటూ పోస్ట్ పెట్టాడు బన్నీ.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. బన్నీ ఈ ఫోటోను షేర్ చేసిన రెండు గంటల వ్యవధిలోనే 8.5 లక్షల మంది లైక్‌లు రావడం విశేషం. మరోవైపు స్నేహారెడ్డి కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫొటోలు షేర్ చేశారు. అటు అల్లు అర్జున్, స్నేహారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరికీ 2011లో వివాహం జరగగా, వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు ఉన్నారు.


ఇక ఈ ఏడాది అల వైకుంఠపురుములో సినిమాతో అలరించిన అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని , ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం.. ఇక బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది..

Show Full Article
Print Article
Next Story
More Stories