Allu Arjun To Play YS Jagan Role: సీఎం జగన్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్?

Allu Arjun To Play YS Jagan Role: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ పార్టీ పెట్టేందుకు స్కెచ్ వేస్తున్నారా? త్వరలో ప్రజాయాత్ర చేసేందుకు సన్నద్ధం అవుతున్నారా?

Raj
By Raj
Updated on: 18 July 2020 9:05 PM IST
Allu Arjun To Play YS Jagan Role: సీఎం జగన్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్?
X
Allu Arjun, YS jagan (file photo)

Allu Arjun To Play YS Jagan Role: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ పార్టీ పెట్టేందుకు స్కెచ్ వేస్తున్నారా? త్వరలో ప్రజాయాత్ర చేసేందుకు సన్నద్ధం అవుతున్నారా? ఈ ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ ఏంటి? పొలిటికల్ ఏంటి అని అనుకుంటున్నారా? అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక యాత్ర ఫెమ్.. మహి వి రాఘవ డైరెక్షన్ లో ఓ మూవీ చేసేందుకు సైన్ చేశాడట బన్నీ. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ నే ఈ సినిమా కధగా మలుస్తున్నాడట డైరెక్టర్ మహి వి రాఘవ.. అంటే అల్లు అర్జున్ స్క్రీన్ పై జగన్ పాత్రలో కనిపించనున్నాడన్నమాట.

సీఎం జగన్ బయోపిక్ ను చేద్దామా అని డైరెక్టర్.. అల్లుఅర్జున్ ను సంప్రదించగా ఒకే చెప్పినట్టు ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన దగ్గరనుంచి సీఎంగా గెలిచేంతవరకూ జరిగిన సంఘటనలను సన్నివేశాలుగా మలచనున్నారట. ఈ వార్త తెలియగానే ఇటు జగన్ అభిమానులు అటు బన్నీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒకవేళ ఈ సినిమా ఖచ్చితంగా ఉంటే లాక్ డౌన్ తరువాత మాత్రమే ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిలిం నగర్ సమాచారం.



Raj

Raj

Next Story