Tollywood Anchors: బుల్లితెర స్టార్ యాంకర్లు.. వారు తీసుకునే రెమ్యూనరేషన్లు..

Tollywood Anchors Remuneration: వెండి తెర పై కనిపించే నటీనటులకు మాత్రమే కాకుండా బుల్లితెర యాంకర్లకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది.

Arun Chilukuri
Published on: 22 Oct 2022 9:22 PM IST
Tollywood Famous Anchors Remuneration List
X

Tollywood Anchors: బుల్లితెర స్టార్ యాంకర్లు.. వారు తీసుకునే రెమ్యూనరేషన్లు..

Tollywood Anchors Remuneration: వెండి తెర పై కనిపించే నటీనటులకు మాత్రమే కాకుండా బుల్లితెర యాంకర్లకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. తెలుగులో బాగా కనిపించే యాంకర్లు లో మొదటగా అందరూ చెప్పుకునేది సుమ కనకాల గురించి. ఇక సుమ కాకుండా ఇండస్ట్రీలో అనసూయ, ప్రదీప్ మాచిరాజు, మంజూష, రష్మీ వంటి యాంకర్లు కూడా తమదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే బుల్లితెర మీద తమ ఎంటర్టైన్మెంట్తో అందరినీ అలరిస్తూ ఉండే ఈ యాంకర్ల కు ఎంత రెమ్యూనరేషన్ దొరుకుతుందో తెలుసా? ఇండస్ట్రీలో ఉన్న యాంకర్లు మరియు వారి రెమ్యూనరేషన్ లపై ఒక లుక్కేయండి..

సుమ కనకాల:

ప్రస్తుతం తెలుగులో సుమ కనకాలకు మించిన స్టార్ యాంకర్ ఎవరు లేరు. సుమ లేని స్టార్ హీరో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా ఊహించుకోవడం కష్టమే. అలాంటి సుమ ఒక్కో ఈవెంట్ కు 3.5 నుండి 4 లక్షల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

ప్రదీప్ మాచిరాజు:

మేల్ యాంకర్లలో ముందుగా వినిపించేది ప్రదీప్ మాచిరాజు పేరే. మంచి క్రేజ్ ఉన్న ప్రదీప్ మంచి అవకాశాలతో ముందుకు దూసుకు వెళుతున్నారు. ఇప్పుడు ప్రదీప్ ఒక్కో ఈవెంట్ కు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

అనసూయ భరద్వాజ్:

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర మీద కూడా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అనసూయ. తన గ్లామర్ తో యువతను ఉర్రూతలూగించే అనసూయ ఒక్కో ఈవెంట్ కు రెండు నుంచి మూడు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

రష్మీ గౌతమ్:

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన యాంకర్ రష్మీ గౌతమ్. అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తూ బుల్లితెర మీద మాత్రం మంచి షోలతో బాగానే సెటిల్ అయిన రష్మీ గౌతమ్ కూడా ఒక్కో ఈవెంట్ కు రెండు నుంచి మూడు లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటుంది.

రవి:

మేల్ యాంకర్లలో ప్రదీప్ తర్వాత అంతే బాగా వినిపించే పేరు రవి. ఈ మధ్యనే బిగ్ బాస్ కి కూడా వెళ్లి వచ్చిన రవి ఒక్కో ఈవెంట్ కు లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటారు.

శ్యామల:

బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న శ్యామల ఈమధ్య యూట్యూబ్ లో తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఒక్కో ఈవెంట్ కు ఈమె లక్ష రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తోంది.

మంజూష:

ఒకప్పుడు నటిగా మంచి ప్రయత్నాలు చేసినా మంజూష ఇప్పుడు యాంకర్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎప్పుడు ఇంటర్వ్యూలలో కనిపించే మంజూష ఒక్కొక్క ఇంటర్వ్యూ కి లక్ష రూపాయల వరకు తీసుకుంటుంది.

వర్షిని:

ఈ మధ్యన టాలీవుడ్ లో యాంకర్ వర్షిని పేరు కూడా బాగానే వినిపిస్తోంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉన్న వర్షిని కూడా జబర్దస్త్ షో ద్వారానే పాపులర్ అయింది. ఈమె ఒక్కో ఈవెంట్ కు 50 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story