Tollywood: వామ్మో 'దృశ్యం పాప' ఎలా మారిందో చూశారా.? హాట్‌ ఫొటో షూట్స్‌తో

Esther Anil Latest Photos: వెంటకేష్‌, మీనా జంటగా వచ్చిన దృశ్యం సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Esther Anil Latest Photos
X

Esther Anil

Esther Anil Latest Photos: వెంటకేష్‌, మీనా జంటగా వచ్చిన దృశ్యం సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తెలుగు విషయానికొస్తే దృశ్యంలో వెంకటేష్‌ కూతుర్లుగా నటించిన ఇద్దరూ మంచి నటనను కనబరిచారు. తమ అద్భుత నటనతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.



కాగా వీరిద్దరిలో చిన్న కూతురిగా నటించి ఎస్తర్‌ అనిల్‌ అందరకీ పరిచయమే. ఈ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అద్భుత నటనను కనబరించింది. వయసులో చిన్నదే అయినా భావోద్వేగాలను బాగా పలకరించింది. కాగా మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఎస్తార్‌ దృశ్యం తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. మొన్నటికి మొన్న వచ్చిన తమిళ సినిమాలో ఏకంగా హీరోయిన్‌ రోల్‌లో కూడా కనిపించింది.



కాగా ప్రస్తుతం ఆడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తోన్న ఎస్తార్‌ సోషల్‌ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. అయితే దృశ్యం సినిమాకు ఇప్పటికీ ఎస్తార్‌ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఇన్‌స్టా వేదికగా హాట్‌ హాట్ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. దీంతో దృశ్యం పాప ఇంతలా మారిందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల సముద్రపు ఒడ్డున బ్లాక్‌ డ్రస్‌లో దిగిన ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story