Tollywood Movies: ఆడియెన్స్‌ని అబ్బురపరచడానికి మాయలు చేస్తున్న డైరక్టర్లు

Tollywood Movies: బాహుబలి సినిమా తర్వాత మారిన టాలీవుడ్‌ మేకింగ్‌ స్టైల్ మారింది.‌

Sandeep Eggoju
Updated on: 9 March 2021 9:35 AM IST
VFx in telugu Movies
X

టాలీవుడ్ మూవీస్ 

Tollywood Movies: బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్‌ మేకింగ్‌ స్టైల్‌ మారింది. కథల్లో మార్పులతో భారీ బడ్జెట్‌తో వస్తున్నాయి. భారీ బడ్జెట్‌కు తగ్గట్టు భారీ గ్రాఫిక్స్‌ ఉండాలంటే.. ఇక త్వరలో రాబోతున్న సినిమాల్లో గ్రాఫిక్స్‌ కే ఇంపార్టెంట్‌.

త్వరలో రిలీజ్ అయ్యే సినిమాలకు భారీ గ్రాఫిక్స్‌లే మూలాధారం అవుతున్నాయి. RRR, ఆచార్య, రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌, కేజీఎఫ్‌-2, పవన్‌ కల్యాణ్‌, క్రిష్ కాంబినేషన్‌లో రాబోతున్నసినిమా, రాంచరణ్, శంకర్ కాంబినేషన్ సినిమా, అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ పుష్ప సినిమాలతో పాటు మహేష్ సర్కార్ వారి పాట సినిమా వరకు భారీ గ్రాఫిక్స్ సినిమాలే

ప్రభాస్- నాగ్అశ్విన్, ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్‌ సినిమా, మహేష్ బాబు- రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చే సినిమాలు కూడా భారీ గ్రాఫిక్స్ తోనే ఉండబోతున్నాయి. మనం చూడని, చూడలేని ఎన్నో అద్భుత విజువల్స్ గ్రాఫిక్స్ ద్వారా మన స్టార్స్ చూపిస్తున్నారు. టాలీవుడ్‌లో గ్రాఫిక్స్‌కు డిమాండ్ పెరగటంతో ఇప్పటికే కన్నడ స్టార్స్ కూడ గ్రాఫిక్స్ పై దృష్టి పెట్టారు. ఇక భవిష్యత్‌లో వచ్చే అన్ని సినిమాలు గ్రాఫిక్స్‌తో హడలెత్తించటంతో పాటు, అలరించబోతున్నాయి. అంతే కాదు సినిమా మొత్తం గ్రాఫిక్స్ మాయజాలం అవ్వొచ్చు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story