VV Vinayak on Covid19 Vaccine: కరోనాకు ఈ ఇంజెక్షన్ పనికొస్తుందేమో... వైద్యులకు వినాయక్ సలహా!

VV Vinayak on Covid19 Vaccine: కరోనాకు ఈ ఇంజెక్షన్ పనికొస్తుందేమో... వైద్యులకు వినాయక్ సలహా!
x
vv vinayak (File Photo)
Highlights

VV Vinayak on Covid19 Vaccine: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో ఉన్నారు శాస్తవేత్తలు.

VV Vinayak on Covid19 Vaccine: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ని కనిపెట్టే పనిలో ఉన్నారు శాస్తవేత్తలు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కరోనాను విరుగుడు సలహా ఇవ్వడం వైరల్ గా మారింది. బహుశా.. కరోనాకు విరుగుడు ఆ ఇంజెక్షన్ తో సాధ్యమౌతుందేమో అనే అనుమానం వ్యక్తంచేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన చేశారు.. ఇంతకీ ఆ ఇంజెక్షన్ ఎల్లో ఫీవర్ అనే వ్యాధి రాకుండా ఇచ్చే ఇంజెక్షన్...

ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఓ సారి నేను కెన్యా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు అక్కడికి వెళ్లాలంటే ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్పారు... అప్పుడు ఆ ఇంజక్షన్ గురించి అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు కరోనా లక్షణాలుగా ఏవైతే చెబుతున్నారో.. సరిగ్గా అవే లక్షణాలు ఎల్లో ఫీవర్ లో కూడా ఉన్నట్టు నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నట్టుగా వినాయక్ వెల్లడించారు.. ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ గురించి ఆ వైద్యులకు చెప్పడమే తన ఉద్దేశమని, ఈ ఇంజెక్షన్ ఏమైనా కరోనా నివారణకు పనికొస్తుందేమోనని అభిప్రాయపడ్డాడు వినాయక్.. ఇక తాను చెప్పిన ఈ విషయాన్నీ ఎవరు పాటించవద్దని కేవలం వైద్యులకు మాత్రమే తన ఆలోచనను వివరించినట్లు వినాయక్" వెల్లడించాడు..

ఇక అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 22,771 కేసులు నమోదు కాగా, 467 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 7,19,665 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,59,557 ఉండగా, 4,39,947 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 20,160 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,41,430 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,02,11,092 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories