టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్.. ఈ సారి త్రివిక్రమ్ దర్శకత్వంలో

టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్.. ఈ సారి త్రివిక్రమ్ దర్శకత్వంలో
x
Venkatesh, Trivikram Srinivas (File Photo)
Highlights

తెలుగు సినిమాలో మాటల రచయతగా సినీ ప్రస్థానం ప్రారంభించి అతనదైన శైలిలో అద్భుతమైన పంచ్ డైలాగ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి తనకంటూ ఒక ప్రత్యేకతను...

తెలుగు సినిమాలో మాటల రచయతగా సినీ ప్రస్థానం ప్రారంభించి అతనదైన శైలిలో అద్భుతమైన పంచ్ డైలాగ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు త్రివిక్రమ్. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ అద్భుతమైన కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, నాని హీరోలుగా ఒక మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసినట్టు సమాచారం.

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మల్టీస్టారర్స్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో దర్శకులు, నిర్మాతలు సైతం మల్టీస్టారర్ సినిమాలు రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లేశ్వరి', వంటి చిత్రాలకు త్రివిక్రమ్ మాటల రచయత గా పని చేసిన విషయం మనకు తెలిసిందే.. ముందు ఎన్టీఆర్‌తో సినిమా పూర్తి చేసాక ఈ సినిమాను స్టార్ట్ చేయాలనుకున్నారు త్రివిక్రమ్. మరో వైపు లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లకు గ్యాప్ రావడంతో ఈ రెండు నెలల సమయంలో ఆ కథపై వర్క్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం స్టోరీ డెవెలప్ చేసే పనిలో ఉన్న ఆయన.. ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు నానికి అవకాశం ఇవ్వాలని, క్రేజీ మల్టీస్టారర్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని చూస్తున్నారని సమాచారం. ఈ మేరకు త్రివిక్రమ్ నానీ సంప్రదించనున్నట్లు తెలుస్తుంది.

సంక్రాంతి కానుకగా వచ్చిన 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో భారీ విజయం అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాని ఎన్టీఆర్‌తో చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇక ఇప్పటికే ఆ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసాడని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నారని... ఈ సినిమాను అతి త్వరలో సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారని సమాచారం. అయితే ఈ చిత్రానికి 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ చిత్రంతో పాటే వెంకటేష్ సినిమా పూర్తిచేస్తారా? లేక ఎన్టీఆర్ సినిమా పూర్తి అయ్యాక ఆ చిత్రానికి సంబంధించి పనులు మొదలు పెడతారా.. అనేది తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories