రాజేంద్రప్రసాద్ తలుచుకోకుండా ఉంటే నేను దర్శకుడిని అయ్యేవాడిని కాదు.. ఎస్వీ కృష్ణారెడ్డి

రాజేంద్రప్రసాద్ తలుచుకోకుండా ఉంటే నేను దర్శకుడిని అయ్యేవాడిని కాదు.. ఎస్వీ కృష్ణారెడ్డి
x
Highlights

Tollywood director SV Krishna reddy : ఎన్నో హిట్ సినిమాలు తీసిన ఎస్వీ కృష్ణారెడ్డి ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్నారు. అయన త్వరలోనే మరో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఎస్వీ కృష్ణారెడ్డి ఈ పేరు తెలీని తెలుగు సినిమా అభిమాని దాదాపుగా ఉండరు. సెంటిమెంట్..కామెడీ కలగలిపి సూపర్ హిట్ లు తీసిన దిట్ట. దర్శకత్వమే కాదు.. నిర్మాతగా.. ముఖ్యంగా సంగీత దర్శకుడిగా కృష్ణారెడ్డి బాణీ సపరేటు. రాజేంద్రప్రసాద్ తో హ్యాట్రిక్ హిట్స్.. ఆలీని హీరోగా పెట్టి యమలీల లాంటి సన్సేషనల్ హిట్.. విడాకుల సమస్యను అందరూ మెచ్చేలా తీసినా.. భర్తను అమ్మేసుకోవడం అనే యన్టీ సెంటిమెంట్ లైన్ తో బాక్సాఫీస్ షేక్ చేసినా అది ఒక్క కృష్ణారెడ్డికె చెల్లింది. ఎఆర్ రహమాన్ మీ అభిమాన సంగీత దర్శకుడు ఎవరు అంటే.. ఎస్వీ కృష్ణారెడ్డి అని చెప్పారట. అలా సంగీతంతో నూ తన ముద్ర వేసిన దర్శకుడు. కొంతకాలంగా అయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన రెండు ప్రాజెక్టులు పట్టలేక్కించే పనిలో ఉన్నారు. ఈలోగా యమలీల ఆ తర్వాత అంటూ ఈటీవీ తీస్తున్న సీరియల్ కు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణారెడ్డి ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో ఆలీతో మాట్లాడారు. ఎన్నో విషయాలు అయన ఆలీతో పంచుకున్నారు.

దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి మొదటి సినిమా మాయలోడు.. అంతకు ముందు ఆయన కధకుడిగా..నిర్మాతగా..సంగీత దర్శకుడిగా కొబ్బరిబోండాం అనే సినిమా చేశారు రాజేంద్ర ప్రసాద్ తో ఈ రెండు సినిమాలూ సూపర్ హిట్ . మాయలోడు సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించిన చిన్న సినిమా తరువాత రాజేంద్రుడు గజేంద్రుడు అనే సినిమా చేశారు రాజేంద్రప్రసాద్ తో కృష్ణారెడ్డి. ఇది కూడా సూపర్ హిట్. ఇలా అవుట్ అండ్ అవుట్ హిట్ సినిమాలు ఇచ్చిన కృష్ణారెడ్డి తరువాత ఎందుకనో రాజేంద్రప్రసాద్ తో సినిమాలు చేయలేదు. ఈ విషయంలో చాలా కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే, వాటిని అటు రాజేంద్ర ప్రసాద్ కానీ, ఇటు కృష్ణారెడ్డి కానీ సమర్ధించలేదు.. అలా అని ఖండించనూ లేదు. ఎవరి పని వారు చేసుకుంటూ పోయారు. ఇప్పుడు ఈ విషయంపై ఆలీతో మాట్లాడారు క్రిష్ణారెడ్డి.

ఇండస్ట్రీలో చిన్న చ్నిన్న వివాదాలు మామూలే అని చెప్పారు కృష్ణారెడ్డి. అయితే, రాజేంద్రప్రసాద్‌ అనే వ్యక్తి తలచుకోకుండా ఉండి ఉంటే, ఎస్వీ కృష్ణారెడ్డి అనేవాడు డైరెక్టర్‌ అయ్యేవాడు కాదు అంటూ స్పష్టం చేశారు. తానప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎక్కడా పని చేయలేదనీ.. సినిమాలు ఎక్కువగా చూడటం తప్ప తనకు దర్శకత్వ నాలెడ్జి లేదని చెప్పారు కృష్ణారెడ్డి. అయినా, అలాంటి నన్ను దర్శకుడిగా ఒప్పుకోవడం అంటే అది అద్భుతమే. ఆ అద్భుతం చేశారు రాజేంద్రప్రసాద్ అని అన్నారు. ఆయనంటే ఇప్పటికీ తనకు గౌరవం అని చెప్పిన కృష్ణారెడ్డి ప్రస్తుతం అయన తండ్రి పాత్రల్లో ఆదరగోడుతున్నారని చెప్పారు. ఇప్పుడు రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ తో కథ సిద్ధం చేసుకుంటున్నానని, ఆ కథతో అన్నీ కుదిరితే రాజేంద్రప్రసాద్ తో త్వరలోనే సినిమా చేస్తాననీ చెప్పారు కృష్ణారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories