'తెరవెనుక' రకుల్ తమ్ముడు!

తెరవెనుక రకుల్ తమ్ముడు!
x

tera venuka film first look

Highlights

Tera Venuka Film First Look : టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'తెరవెనుక'..

Tera Venuka Film First Look : టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'తెరవెనుక'.. ఈ సినిమాని ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. నెలుట్ల ప్రవీణ్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సందర్భంగా దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ.. దర్శకుడు ప్రవీణ్ చంద్ర తనకు పాతికేళ్లుగా తెలుసునని అన్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా మారినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. 'తెరవెనుక' అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్టుగా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో పనిచేసిన అందరూ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు శంకర్.. అటు సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని త్వరలోనే రిలీజ్ చేస్తామని దర్శకుడు నెలుట్ల ప్రవీణ్ చంద్ర వెల్లడించారు.

ఇక ఈ సినిమాకి కథ, మాటలు - బాబా అందిస్తుండగా, రాము కంద సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బొంతల నాగేశ్వరరెడ్డి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. కాసర్ల శ్యామ్, సురేష్ బనిశెట్టి , బండి సత్యం రఘురామ్ సాహిత్యం అందిస్తున్నారు. అటు రకుల్ వరుస సినిమాలతో బిజీగా ఉంది.





Show Full Article
Print Article
Next Story
More Stories