హీరోకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన డైరెక్టర్

హీరోకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన డైరెక్టర్
x
Gopichand
Highlights

దర్శకుడు సంపత్ నంది హీరో గోపీచంద్ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసాడు.

దర్శకుడు సంపత్ నంది హీరో గోపీచంద్ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. గోపీచంద్ 2013 మే 12న హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లి చేసుకున్నాడు. వారి పెళ్లి రోజు సందర్భంగా దర్శకుడు సంపత్ నంది గోపీచంద్ కు శుభాకాంక్షలు తెలియజేసాడు. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' అనే సినిమా చేస్తున్న విషయం తెనిలిసిందే. చివరిగా గోపీచంద్ 'చాణక్య' చిత్రంలో నటించాడు. అయితే గత కొంత కాలంగా సరైన హిట్ లేని గోపీచంద్ ఈ సినిమా ద్వారా ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

గోపీచంద్ 'తొలివలపు' చిత్రం ద్వారా హీరో గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఆ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్న గోపీచంద్ హీరో నితిన్ నటించిన ' జయం' చిత్రం ద్వారా తొలిసారి ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. తరువాత తేజ దర్శకత్వం వహించిన 'నిజం', అలాగే శోభన్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా వచ్చిన ' వర్షం' చిత్రాలలో కూడా ప్రతినాయకుడిగా నటించిన ప్రేక్షకుల మెప్పుని పొందాడు.

తరువాత ఈతరం ఫిలిమ్స్ పతాకం పై కె.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన 'యజ్ఞం' చిత్రంతో మళ్ళి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆ చిత్రం 2004లో విడుదల అయి విజయవంతం కావడం, తరువాత అమ్మ రాశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'రణం' చిత్రం ద్వారా సుసీక్యూస్ అందుకున్నాడు. తరువాత చేసిని చిత్రాలన్ని ప్రేక్షకులను ఆదరణ పొందటంతో గోపీచంద్ ఆక్షన్ హీరో అనే పేరు సంపాదించుకున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories