ప్లాప్ సినిమాల వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది.. రివ్యూ రైటర్స్ కి పూరి రిక్వెస్ట్!

ప్లాప్ సినిమాల వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది.. రివ్యూ రైటర్స్ కి పూరి రిక్వెస్ట్!
x

puri jagannadh

Highlights

Puri Jagannadh About Flop Movies : పూరి మ్యూజింగ్స్ అంటూ ఎదో ఒక టాపిక్ పైన మాట్లాడుతూ అందరిని ఆలోచింపజేస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. తాజాగా ప్లాప్ సినిమాల పైన మాట్లాడారు పూరి

Puri Jagannadh About Flop Movies : పూరి మ్యూజింగ్స్ అంటూ ఎదో ఒక టాపిక్ పైన మాట్లాడుతూ అందరిని ఆలోచింపజేస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. తాజాగా ప్లాప్ సినిమాల పైన మాట్లాడారు పూరి.. ఇందులో పూరి మాట్లాడుతూ.. ప్లాప్ సినిమాల వల్లే ఇండస్ట్రీ బతుకుతుందని అన్నారు. మొత్తం ఏడాదికి వంద సినిమాలు వస్తే అందులో పది సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. ఇంకో 90 సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. అలా ప్లాప్ అవుతున్న 90 సినిమాల వల్లే ఇండస్ట్రీ బతుకుతుందని పూరి అన్నారు..

"కావాలని ఎవరు ప్లాప్ సినిమాలు తీయరు... పలానా సినిమా ప్లాప్ అవుతుందని తెలిస్తే ఎవరు డబ్బులు పెట్టేందుకు ముందుకురారు కూడా.. బిజినెస్ యాంగిల్ లో చూస్తే అసలు సినిమానే తీయకూడదు. ఎందుకంటే ఇది రిస్కీ బిజినెస్ ఎవరు చేస్తారు.. కానీ సినిమా అంటే పిచ్చి ఉన్నోళ్ళు మాత్రమే సినిమాని చేస్తారు.. అయితే ఈ ఫ్లాప్ సినిమాలు చూడలేక, వాటిని ఎనలైజ్ చేయలేక.. జర్నలిస్టులు తమ రివ్యూలతో వాయించేస్తారు. ఆ రివ్యూల దెబ్బకి అప్పటికే అన్నీ అమ్ముకున్న ప్రొడ్యూసర్ ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోతాడు. అతని స్థానంలో ఇంకొకరు వస్తారు. ఇంకో ఫ్లాప్‌ సినిమా తీస్తాడు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కోట్లు ఖర్చు పెడితే.. యాక్టర్లు, జూనియర్ ఆర్టిస్ట్‌లు, సెట్లు, అవుట్ డోర్ యూనిట్, లొకేషన్ల కోసం ఇలా ఎంతో మందికి పని ఇస్తాడు. ఈ సినిమా వల్ల చాలా మందికి పని దొరుకుతుంది.

ఇక సినిమా రివ్యూస్‌ రాసే అందరికీ చేతులెత్తి మొక్కుతూ అడుగుతున్నా.. మీరు కాపాడాల్సింది ఇలాంటి ఫ్లాప్‌ సినిమాలనే.. బ్లాక్ బస్టర్స్‌ని కాదు. తెలిసో తెలియకో ఓ డైరెక్టర్ ఫ్లాప్‌ తీసి ఉండొచ్చు. కానీ ఆ డైరెక్టర్ వల్ల కొంతమందికి పని, తిండి దిరికింది. కాబట్టి ఆ డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీకు రేటింగ్ ఒకటే ఇవ్వాలనిపిస్తే రెండు ఇవ్వండి. రెండే వేయాలనిపిస్తే మూడు వేయండి. ఆ ఒక్క స్టార్ పెరగడం వల్ల కొన్ని కుటుంబాలు బ్రతుకుతాయి.

సినిమా చూసేటప్పుడు ఇందులో ప్రాణం ఉందా? లేదా శవమా? దీన్ని నేను ఎలా కాపాడగలను అనే చూడండి. దయచేసి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో అప్పుడు లైవ్ అప్డేట్లు ఇవ్వడం మానేయండి.. ఇది ఏ దేశంలో కూడా ఉండదు.. ప్రతి ప్లాప్ సినిమా వెనుక కూడా కొన్ని నెలల కష్టం ఉంటుంది.. ఒకవేళ ఫ్లాప్ తీసినోడు కనబడితే గట్టిగా ఒక హగ్ ఇవ్వండి. ఎందుకంటే అతనే వంద మందికి తిండిపెట్టిన హీరో. ఆ ఫ్లాపులుగానీ లేకపోతే అందరం అడుక్కుతింటాం" అని పూరి వెల్లడించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories