రవితేజ..రెండు సినిమాలు!

రవితేజ..రెండు సినిమాలు!
x
Ravi Teja From Krack Movie
Highlights

ఈ ఏదాడి ఆరంభంలో రవితేజ 'డిస్కోరాజా' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ ఏదాడి ఆరంభంలో రవితేజ 'డిస్కోరాజా' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విభిన్న చిత్రాల దర్శకుడు వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి షో నుంచే మంచి టాక్ వచ్చింది. ఇక మొదటిరోజే రవితేజ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను అందుకున్న చిత్రంగా నిలబడింది. ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు.

ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే రవితేజ తనతో డాన్‌ శ్రీను, బలుపు సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాని మొదలుపెట్టాడు. ఈ సినిమాకి క్రాక్‌ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించానున్నాడు. రవితేజ సరసన శృతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇదే సినిమాతో పాటు రవితేజ మరో సినిమాని మొదలుపెట్టాడు. యాక్షన్‌ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. తాజాగా రమేష్ వర్మ రాక్షసుడు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక గతంలో కూడా రవితేజతో వీర అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఈ సినిమాని యంగ్ హీరో హవీష్‌ నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు మాస్‌ మహరాజ్‌.

ఇంతకుముందు రవితేజకు 'డాన్ శీను'; 'బలుపు' లాంటి హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం ఓ తమిళ హిట్‌కు రీమేక్ అన్న ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. కానీ ఇది ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అంటూ పోస్టర్ మీదే వేశారు. కానీ ఆ మధ్య రిలీజైన 'క్రాక్' టీజర్ చూస్తే మాత్రం జనాలకు మళ్లీ డౌట్లు కొట్టాయి. తమిళ హిట్ 'సేతుపతి'ని గుర్తు చేసే కొన్ని సీన్లు ఈ టీజర్లో కనిపించాయి అని వార్తలు వినిపుస్తున్నాయి. ఐతే గోపీచంద్ కొంచెం తెలివిగా.. మూల కథ తీసుకుని దానికి తనదైన రేతిలో కథను సిద్దం చేసుకున్నాడని భావిస్తున్నారు.

ఇక ఈ సినిమా కథవిషయానికొస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. అన్నీ వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించేలా ఈ సినిమాను గోపీచంద్ మ‌లినేని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ ని గతంలో విడుదల చేశారు. ఈ పోస్టర్లో రవితేజ సోడా బాటిల్‌ పట్టుకొని పోలీసు ఆఫీసర్‌గా ఇంటెన్స్‌ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ పోస్టర్‌లో ర‌వితేజ బ్యాక్‌సైడ్ ఖైదీలు నిల‌బ‌డి ఉండ‌టాన్ని గమనించొచ్చు. ఈ చిత్రాన్ని స‌మ్మర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. అయితే, కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు నిలిచిపోయాయి. ఇంతకుముందు రవితేజకు 'డాన్ శీను'; 'బలుపు' లాంటి హిట్లు ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories