'భద్ర' సినిమా అతనితోనే చేయాలనుకున్నా.. కుదరలేదు : బోయపాటి

మాస్ మహారాజా రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం 'భద్ర'.

S. Srikanth
Updated on: 12 May 2020 7:38 PM IST
భద్ర సినిమా అతనితోనే చేయాలనుకున్నా.. కుదరలేదు : బోయపాటి
X
Boyapati Srinu (File Photo)

మాస్ మహారాజా రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం 'భద్ర'. ఈ చిత్రంతోనే బోయపాటి శ్రీను దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమాలో రవితేజ కనపరిచిన నటన, దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన స్వరాలు, దర్శకుడి శైలి, పేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలై నేటితో (మే 12) 15ఏళ్ళు పూర్తిచేసుకుంది.

ముందుగా దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ తో తీయాలనుకున్నాడు. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కి చెప్పగా.. ఒక అభ్యంతరం చెప్పారు. ఇంత మాస్, ఎమోషనల్ సినిమా చేసే అనుభవం తనకు ఇంకా రాలేదని, ఇప్పటి వరకూ కేవలం 'గంగోత్రి', 'ఆర్య' చిత్రాలు మాత్రమే చేసానని చెప్పడంతో దర్శకుడు బోయపాటి నిరుత్సాహ పడ్డాడు. దీంతో దిల్‌ రాజుకు బోయపాటిని పరిచయం చేసి, కథను దిల్ రాజుకు చెప్పగా అయనకు నచ్చడంతో రవి తేజ కథానాయకుడిగా సినిమా పట్టాలెక్కింది.


అలా 'భద్ర' చిత్రం ద్వార తన సినీ ప్రస్థానం ప్రారంభించాడు. ఆ తరువాత వెంకటేష్ తో కలిసి 'తులసి', బాలకృష్ణతో 'సింహ', జూ . ఎన్టీఆర్ తో 'దమ్ము', 'లెజెండ్', అల్లు అర్జున్ తో 'సరైనోడు', బెల్లం కొండా శ్రీనివాస్ తో 'జయ జనకీ నాయక', రామ్ చరణ్ తో 'వినయ విదేయ రామా' వంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ చిత్రం తో హ్యాట్రిక్ కొట్టాలనే సంకల్పంతో చిత్ర బృందం పనిచేస్తుంది అని తెలుస్తుంది.


S. Srikanth

S. Srikanth

Next Story