Ajay Bhupathi Tested Corona Positive : త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా!

Ajay Bhupathi Tested Corona Positive : భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తుంది.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ

Krishna
Published on: 13 Aug 2020 11:58 AM IST
Ajay Bhupathi Tested Corona Positive : త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా!
X
coronavirus (File Photo)

Ajay Bhupathi Tested Corona Positive : భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తుంది.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి కరోనా సోకుతుంది. ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి.. ఇప్పటికే టాలీవుడ్ లోని సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వారికీ కరోనా నెగిటివ్ అని తేలింది. దీనితో తెలుగు ప్రేక్షకులు ఉపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ సంతోషం నుంచి కోలుకోకముందే మరో దర్శకుడికి కరోనా అని తేలింది. అతనే ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి.. తాజాగా ఈ దర్శకుడికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా అతనే ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. "త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా" అంటూ ట్వీట్ చేశాడు అజయ్ భూపతి.. ఇక ఈ దర్శకుడు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అభిమానులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కోరుకుంటున్నారు.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన అజయ్ భూపతి.. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్ గా వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా మారాడు.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అజయ్ భూపతి రవితేజ హీరోగా మహాసముద్రం అనే సినిమాని చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా పట్టాలేక్కనుంది

Krishna

Krishna

Next Story