Comedian Kosuri Venugopal Passed away: కరోనాతో టాలీవుడ్ సినీ నటుడు వేణుగోపాల్ మృతి...

Comedian Kosuri Venugopal Passed away | ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి చెందారు.

S. Srikanth
Published on: 24 Sept 2020 7:20 AM IST
Comedian Kosuri Venugopal Passed away: కరోనాతో టాలీవుడ్ సినీ నటుడు వేణుగోపాల్ మృతి...
X

Kosuri Venugopal (File Photo)

Comedian Kosuri Venugopal Passed away | ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి చెందారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా చికత్స పొందుతూ మరణించారు. గత 23 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కరోనా నెగెటివ్‌ వచ్చాక కూడా ఆయన కోలుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కోసూరి స్వస్థలం పచ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం. ఎఫ్ఐసీలో ఇటీవలే అయన పదవీ విరమణ పొందారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందారు వంటి సినిమాల్లో అయన నటించారు. ఆయన మృతి విషయం తెలిసిన టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇటీవల ప్రముఖ నటుడు జయప్రకాశ్‌రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే.

వేణుగోపాల్ 'తెగింపు' చిత్రం ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాదరామన్న చిత్రంలో కాన పాత్రకి మంచి గుర్తింపు లభించింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'స్టూడెంట్ నెంబర్ 1' మినహా ఈయన రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి చిత్రంలో నటించారు. మొదట ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేశారు, ఆపై సినిమాల్లో నటించాలనే అభిరుచితో చిత్ర పరిశ్రమలో చేరారు.



S. Srikanth

S. Srikanth

Next Story