Tollywood News: సీఎం జగన్‌తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ

Tollywood News: సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్.. రాజమౌళి, కొరటాల శివ, అలీ, పోసాని, ఆర్.నారాయణమూర్తి

Rama Rao
Published on: 10 Feb 2022 12:47 PM IST
Tollywood Celebrities Meet CM Jagan | Tollywood News
X

సీఎం జగన్‌తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ

Tollywood News: ఏపీ సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చించేందుకు చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు భేటీలో పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సినిమా టికెట్ల ధరలపై సీఎంకు వారు వివరించనున్నారు. మరోవైపు, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం.. పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమైన తరుణంలో ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ భేటీపైనే ఉంది. ఈ సమావేశంతో సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story