పవన్ Vs చరణ్.. ఇదెక్కడి ట్విస్ట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది.

Arun Chilukuri
Published on: 9 Dec 2025 3:30 PM IST
పవన్ Vs చరణ్.. ఇదెక్కడి ట్విస్ట్..!
X

పవన్ Vs చరణ్.. ఇదెక్కడి ట్విస్ట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చిలో రిలీజ్ కానుంది. అయితే ఆ మార్చి నెల ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది, నాని ది ప్యారడైజ్ సినిమాలతో నిండిపోయింది. దీంతో ఈ మూడు పెద్ద సినిమాల మధ్య భారీ పోటీ తప్పదు.

దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మాస్ ఎంటర్‌టైనర్‌గా భారీ అంచనాలు సృష్టించింది. కానీ మార్చి 26న రామ్ చరణ్ పెద్ది, మార్చి 27న నాని ది ప్యారడైజ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మార్చి నెలలో ముఖాముఖీగా వస్తున్న ఈ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్‌ను భారీ స్థాయిలో కుదిపేయనున్నాయి. మార్చి నెలలో ఈ మూడు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం అనేది ఆసక్తికరంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story