Top
logo

సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ.. బాలయ్యకు ఆహ్వానం

సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ.. బాలయ్యకు ఆహ్వానం
X
YS Jagan (File Photo)
Highlights

ఈ నెల 9వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు సినీ పెద్దలు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి...

ఈ నెల 9వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు సినీ పెద్దలు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చర్చించేందుకు ఈ నెల 9న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌తో భేటీ కానున్నామని నిర్మాత సి. కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణతో సహా టాలీవుడ్‌కు చెందిన అందరినీ ఆహ్వానించామన్నారు. కాని జూన్‌ 10న బాలకృష్ణ జన్మదిన వేడుకల వల్ల తాను రాలేనని బాలకృష్ణ చెప్పారని ఆయన వివరించారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు చెబుతామని సి. కళ్యాణ్‌ పేర్కొన్నారు.

Web TitleTollywood Bigwigs To Meet AP CM Jagan on June 9th
Next Story