టాలీవుడ్‌ను వెంటాడుతున్న థర్డ్‌వేవ్‌ భయం

* థియేటర్లు తెరిచి రెండు వారాలైనా.. రిలీజ్‌కాని బడా సినిమాలు * థియేటర్లలో సందడి చేస్తున్న చిన్న సినిమాలు

Sandeep Reddy
Published on: 13 Aug 2021 9:01 AM IST
Tollywood Big Movies Not Ready To Release in Theaters Even Theaters Opened From Last 2 Weeks
X

థియేటర్స్ వర్సెస్ ఓటిటి (ఫైల్ ఫోటో) 

Tollywood: టాలీవుడ్‌ను థర్డ్‌వేవ్‌భయం వెంటాడుతోంది. థియేటర్ల గేట్లు తెరిచి, రెండు వారాలు గుడుస్తున్నా ఒక్క స్టార్ సినిమా రిలీజ్ చేయడానికి సాహసం చేయడంలేదు. ఇక చిన్న చితకా సినిమాలు థియేటర్లలో తెగ సందడి చేస్తున్నాయి. నాని ట‌క్ జ‌గ‌దీష్‌, నాగ చైతన్య లవ్ స్టోరీ, రానా విరాట పర్వం, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్, నాగశౌర్య వరుడు కావలెను, గోపిచంద్ సీటీమార్ వంటి సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. కానీ ఆ సినిమాల దర్శకనిర్మాతలు రిలీజ్‌ ఊసే తీయడం లేదు.

దేశవ్యాప్తంగా కేసులు పెద్దగా లేకున్నా థర్డ్ వేవ్ టెన్షన్‌ మాత్రం బలంగా ఉంది. దీంతో దర్శక నిర్మాతలు ఇప్పుడే సాహసం చేయడం ఎందుకని సైలెంట్‌ అవుతున్నారు. ఇక కొందరైతే ఓటిటి ప్లాట్ ఫామ్స్ ఆఫర్స్ కు అట్రాక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. టక్‌ జగదీశ్‌, సీటీమార్‌, లవ్‌స్టోరీతో వంటి సినిమాలు ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ అది ఎంతవరకు నిజమో చూడాలి

Sandeep Reddy

Sandeep Reddy

Next Story