Tollywood: పాతికేళ్ల కుర్రాడితో జతకట్టనున్న జేజేమ్మ!

Tollywood Anushka Shetty to Romance With Young Hero
x

ఇమేజ్ సోర్స్: టాలీవుడ్.నెట్


Highlights

Tollywood: భిన్నమైన పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపించే అనుష్క ఓ వైవిధ్యమైన చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిందని టాక్‌.

Tollywood: పదేళ్ల పాటు తెలుగులో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మన టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ వైవిధ్యమైన కథా చిత్రాల్లో భిన్నమైన పాత్రల్లో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. తాజాగా అనుష్క శెట్టికి జోడీగా ఓ కుర్ర హీరో నటించబోతున్నట్లు తెలుస్తుంది. అతనెవరో కాదు.. నవీన్ పొలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో ఆకట్టుకున్న నవీన్.. ఇప్పుడు జాతిరత్నాలుతో వస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఈయనకు అనుష్కతో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది. కథ ప్రకారం తనకంటే చిన్నవాడితో హీరోయిన్ చేసే ప్రయాణమే కథ. దీనికి నవీన్ అయితే బాగుంటాడని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.

తెలుగులో టాప్ హీరోయిన్‌గా అనూహ్యంగా అనుష్క పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయింది. ఈమెకు అవకాశాలు కూడా తక్కువ అయిపోయాయి ఇప్పుడు. సీనియర్ హీరోయిన్ కావడంతో కుర్రాళ్లకు సెట్ కావడం లేదు. సీనియర్ హీరోలు కూడా ఈమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. మరోవైపు దర్శక నిర్మాతలు కూడా ఎందుకో మరి అనుష్కను లైట్ తీసుకుంటున్నారు. భాగమతి తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని గతేడాది నిశ్శబ్ధం సినిమాతో వచ్చింది అనుష్క. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. నిశ్శబ్ధం తర్వాత అనుష్క మరోసారి గ్యాప్ తీసుకుంది. ఈ సారి గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందంతే. దర్శకులు ఈమె కోసం కథలు సిద్ధం చేయడం కూడా తక్కువైపోయింది. చాలా రోజుల కింద ఈమె మహేష్ అనే దర్శకుడితో సినిమాకు కమిటైంది. గతంలో సందీప్ కిషన్ హీరోగా రారా కృష్ణయ్య సినిమాను తెరకెక్కించాడు ఈయన. ఆ సినిమా వచ్చిన ఆరేళ్ళ తర్వాత ఇప్పుడు మహేష్ దర్శకత్వంలో మరో సినిమా రాబోతుంది. అనుష్క ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో ఈ సినిమా రానుంది. యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది.

ఇంతకీ అనుష్క, నవీన్‌ పొలిశెట్టితో ఈ వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు ఎవరో కాదు.. మహేశ్‌. ఈ డైరెక్టర్‌ ఇది వరకు సందీప్‌కిషన్‌, రెజీనాలతో 'రా రా కృష్ణయ్య' సినిమాను తెరకెక్కించాడు. డైరెక్టర్‌ మహేశ్‌ చెప్పిన కథ విన్న అనుష్క, ఈ వైవిధ్యమైన ప్రేమ కథలో నటించడానికి అనుష్క ఓకే చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories