Anupama Parameswaran Accept Green India Challenge: 12 మందికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన అనుపమ!

Anupama Parameswaran Accept Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సినీ,రాజకీయ

Krishna
Updated on: 21 July 2020 3:07 PM IST
Anupama Parameswaran Accept Green India Challenge: 12 మందికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన అనుపమ!
X
anupama parameswaran accepted green india challenge

Anupama Parameswaran Accept Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది. అందులో భాగంగా హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కేరళ తిరుచూరులోని తన నివాసంలో ఒక మొక్కను నాటారు.

ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ. గత కొద్ది రోజుల క్రితం నేను 25 మొక్కలు నాటాను.. అందులో 23 మొక్కలు బాగా ఉండగా మరో రెండు మొక్కలు చనిపోయాయి. అది నాకు చాలా భాదేసింది. ఈ క్రమంలో నాకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నుంచి పిలుపు వచ్చింది. అప్పుడు సంతోషం అనిపించింది. అయితే మా ఇంటి ఆవరణంలో పెద్దగా ఎక్కువ ఖాళీ స్థలం లేని కారణంగా ఒక్క మొక్కను మాత్రమే నాటాను. అయితే మిగిలిన మొక్కలను త్వరలోనే నాటుతాను అని ప్రమాణం చేస్తున్నాను. ఇక ఇంత మంచి కార్యక్రమంలో నాకూడా స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు అని అనుపమ వెల్లడించింది.

ఈ సందర్భంగా అనుపమ కాళిదాస్ జయరామ్, నివేదా థామ‌స్, ఆహన కృష్ణ, రాజీష్ విజయాన్, పద్మ సౌర్య, పిరలే మాన్య, గౌరీ కృష్ణ, గౌతమి నైరి, సిజ్జు విల్సన్, అను సితార, సితార కృష్ణ శంకర్, లక్ష్మీ ప్రియ విశాకులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరి మొక్కలు నాటలని కోరింది. ఇక అనుపమ తమిళ్, తెలుగు బాషలలో పలు చిత్రాలతో బిజీగా ఉంది.

Krishna

Krishna

Next Story